'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మధ్యకాలంలో అందాల విందు చేస్తూ కీర్తి సురేష్ రచ్చ రచ్చ చేస్తుంది.
కీర్తి సురేష్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రామ్ పోతినేని హీరోగా నటించిన ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత ఈ అమ్మడు అనేక సినిమాలో నటించినా మహనటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలో కీర్తి సురేష్.. గ్లామర్ రోల్స్ చేయదని అందరూ అనుకున్నారు. కీర్తీ సురేష్ ఎప్పటికీ గ్లామర్ క్వీన్ కాలేదు అని వెక్కిరించిన నెగిటివ్ ఫ్యాన్స్ కళ్ళు పేలిపోయేలా గ్లామర్ రోల్స్ లో కూడా నటించారు. నితిన్ హీరోగా నటించిన ‘రంగ్ దే’ సినిమాలో రొమాంటిక్ సీన్ లో నటించి.. అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక తరచూ తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇప్పటికే అనేక హాట్ ఫోటోలు షేర్ చేసిన ఈ అమ్మడు.. తాజాగా మరో హాట్ వీడియోను షేర్ చేసింది. పొట్టిడ్రెస్ లో అందాల విందు చేస్తూ కీర్తి యోగాసనాలు వేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘నేను శైలజ’ సినిమాలో ఎంతో హోమ్లీ అమ్మాయిగా కీర్తి సురేష్ కనిపించింది. ఆ తరువాత వచ్చిన పలు సినిమాలో కూడా అలానే కనిపించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ సంచనలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కీర్తి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అచ్చం సావిత్రిగారిలా అద్భుతంగా నటించి మెప్పించింది. ఇదే సమయంలో చాలామంది డీగ్లామర్ రోల్స్ మాత్రమే కీర్తి చేస్తుందని కామెంట్స్ చేశారు. ఇటీవల కొన్ని సినిమాలో గ్లామర్ రోల్స్ లో నటించి.. అలాంటి వారి కామెంట్స్ కు సమాధానం చెప్పింది. డీగ్లామర్, గ్లామర్.. ఇలా రెండు పాత్రలో నటిస్తూ ఈ అమ్మడు దూసుకెళ్తుంది.
మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలకి భిన్నంగా సర్కారు వారి పాట సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ మునుపెన్నడూ లేని విధంగా హాట్ లుక్స్ తో, ఘాటు ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తుంది. పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్స్ అంతకాకపోయినా తనకున్న పరిధిలో గ్లామర్ టచ్ ఇస్తూ అభిమానుల్ని అల్లరిస్తుంది. కేవలం కంటెంట్ ని, డీగ్లామర్ రోల్స్ ని మాత్రమే నమ్ముకుంటే లాభంలేదని ఆమె అప్పుడప్పుడు కొంచెం హాట్ గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ట్రెండ్ కి అనుగుణంగా తనను తాను గ్లామర్ క్వీన్ గా మలచుకుంటున్న కీర్తి సురేష్.. కిల్లింగ్ లుక్స్ తో కనిపిస్తూ మరోసారి ఉక్కిరిబిక్కిరి చేశారు.
సోషల్ మీడియాలో తనకు సంబంధించిన గ్లామర్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంది. తన అందాలతో కుర్రాళ్ల పిచ్చేకిస్తోంది ఈ అమ్మడు. తాజాగా పొట్టి డ్రెస్ లో అందాల విందు చేస్తూ కీర్తి యోగాసనాలు చేసింది. పచ్చని గడ్డిపై శరీరాన్ని నలువైపుల తిప్పుతు కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన యోగాసనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. కీర్తి సురేష్ సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా తనుతాను మార్చుకుంటూ ఉంటుంది. అందుకోసమే నిత్యం యోగాసనాలు చేస్తుంది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్.. దసరా, భోళా శంకర్ అనే సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కీర్తి సురేష్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.