కంగనా రనౌత్.. ప్యాషన్ రంగం నుంచి మెల్ల మెల్లగా సినిమాల్లోకి అడుగులు వేసి నటిగా మంచి మార్కులే లాగేసుకుంది. ఇక ఇప్పటికీ మూడు జాతీయ అవార్డులు తీసుకుని నటిగా మంచి గుర్తింపును మూటగట్టుకుందీ అమ్మడు. అయితే ప్రస్తుతం బాలివుడ్ లో ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ లలో ఒకరు నిలిచారు కంగనా రనౌత్. ఇక సినిమాలే కాకుండా అప్పుడప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూ తన గళాన్ని వినిపిస్తుంటుంది.
కాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరెక్కుతున్న చిత్రంలో తలైవి. ఇందులో జయలలిత పాత్రలో నటిస్తోంది కంగనా. ఈ సినిమాలో కంగనా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా విడుదల విషయంలో మాత్రం కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. మల్టీప్లేక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తమ సినిమా విడుదలకు మోకాలు అడ్డు పెడుతున్నారని అగ్రహం వ్యక్తం చేసింది .
కావాలనే తమ చిత్రాన్ని విడుదల సహకరించకుండా విద్వేశాలను రెచ్చగొడుతున్నారని తెలిపింది కంగనా. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించింది కంగనా రనౌత్. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, ఇంకా అనేక భాషల్లో సినిమాల్లో నటించాలనుందని తెలిపింది.