తెలుగు ప్రేక్షకులు నిజంగా దేవుళ్లే! ఎందుకంటే బాగుంటే అది ఏ సినిమా అయినా సరే ఆదరిస్తారు. ఇక నచ్చితే భాషతో సంబంధం లేకుండా హీరోయిన్ ని తెగ ప్రేమిస్తారు. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన బ్యూటీ హనీరోజ్. బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తెగ ఫేమ్ సంపాదించింది. సోషల్ మీడియాలోనూ ఈమెకి మన ఆడియెన్స్ నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. అందుకు తగ్గట్లే ఈమె కూడా హాట్ హాట్ ఫొటోలతో కాక రేపుతోంది.
ఇక విషయానికొస్తే.. ‘వీరసింహారెడ్డి’లో ఓ హీరోయిన్ గా నటించిన హనీరోజ్ తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. పద్ధతిగా చీరలోనే కనిపించినప్పటికీ.. ఆమె గ్లామర్, ఆ అందానికి ప్రతి ఒక్కరూ పడిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆమె స్మైల్ కి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో తన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు హనీ బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తుంది. అందుకు తగ్గట్లే ‘వీరసింహారెడ్డి’ ఈవెంట్స్ లో తెగ సందడి చేస్తోంది.
సంక్రాంతి రిలీజైన ‘వీరసింహారెడ్డి’.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం ఫుల్ జోరు చూపిస్తోంది. రూ.100 కోట్ల గ్రాస్ ని ఎప్పుడో దాటేసిన బాలయ్య సినిమా.. ప్రస్తుతం లాభాల్లో దూసుకెళ్తోంది. హైదరాబాద్ లో ఆదివారం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందులో వైలెట్ కలర్ డ్రస్ లో కనిపించిన హనీరోజ్.. బంగారం తళతళ మెరిసిపోతూ కనిపించింది. ఇప్పుడీ ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి హనీరోజ్ ని ఇలా చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Gorgeous #HoneyRose at the Veera Mass Blockbuster Celebrations 💥💥
Watch వీరసింహుని విజయోత్సవం Live Now!
– https://t.co/OYdts1a9tU#BlockBusterVeeraSimhaReddy
Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @shreyasgroup pic.twitter.com/S8ltXA3S1H
— Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2023