టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ.. ఎన్నో సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్(అక్క , వదిన, పిన్ని) ఇలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే.. సినిమా లైఫ్ లో మంచి, చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. వాటిని సమయం సందర్భం వచ్చినప్పుడు సినీతారలు షేర్ చేసుకుంటారు. తాజాగా హేమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకి ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది.
హేమ మాట్లాడుతూ.. ‘సాధారణంగానే ఇండస్ట్రీ వాళ్లంటేనే జనాలు లోకువగా చూస్తారు. కెరీర్ లో ఎన్నో కష్టాలుపడి తల్లి సపోర్ట్‌తో ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడంటే క్యారవాన్స్ వచ్చి అన్ని సౌలభ్యంగా ఉన్నాయి. కానీ అప్పట్లో షూటింగ్ లొకేషన్స్ లో బట్టలు మార్చుకోవాలంటే సరైన వసతులు ఉండేవి కాదు. కనీసం టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు.
గతంలో ‘భారతనారి’ అనే ఓ సినిమా చేస్తున్నప్పుడు ఓ ప్రొడక్షన్ బాయ్ నన్ను అవమానపరిచాడు. షూటింగ్ బ్రేక్ టైంలో డైరెక్టర్ సహా యూనిట్ అంతా కలిసి భోజనం చేస్తుండగా నేను కూడా వాళ్లతో పాటే తింటున్నాను. అప్పుడు ప్రొడక్షన్ బాయ్ వచ్చి.. ‘నువ్ ఇక్కడ కాదు అక్కడికెళ్లి తిను’ అనేసరికి అవమానంగా అనిపించింది. పక్కనున్న టేబుల్ ఎత్తి అతని పై పడేద్దాం అనేంత కోపం వచ్చింది.
ఈ క్రమంలో తింటే అందరితోనే కలిసి తినాలని ఫిక్స్ అయ్యాను. నన్ను అవమానించిన ఆ ప్రొడక్షన్ బాయ్ ఇప్పటికీ ఉన్నాడు. మరో సినిమా టైంలో మళ్లీ అదే ప్రొడక్షన్ బాయ్ వచ్చి చాలా మర్యాదగా భోజనం పెట్టాడు. ఇన్నేళ్ళైనా కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను’ అంటూ తన గతాన్ని చెప్పుకొచ్చింది. మరి నటి హేమ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.