ఏ భాషాచిత్రాలలో నటించినా ఏదొక సమయంలో నటీనటుల పేర్లు అన్ని భాషల ప్రేక్షకులకు పరిచయం అవుతుంటాయి. నటులు కదా! కాలం కలిసి వచ్చినప్పుడు వేరే భాషలలో కూడా సినిమాలు చేసి.. ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. అలా ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన బ్యూటీ ఎవెలిన్ శర్మ. జర్మనీలో పుట్టి పెరిగిన ఈ భామ.. బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి వరుస సినిమాలతో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో.. అప్పటినుండి సినిమాలకు దూరంగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది.
ఎవెలిన్ శర్మ.. కేవలం 7 ఏళ్ళు మాత్రమే సినిమాలలో కొనసాగింది. బాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. 2019లో చేసిన ఒకే ఒక్క తెలుగు సినిమాతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరైంది. అవును.. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమాలో నటించి.. ఆ తర్వాత సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది ఎవెలిన్. ఆ తర్వాత నుండి పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టింది. 2019లో ఇండో-ఆస్ట్రేలియన్ డెంటల్ సర్జన్, బిజినెస్ మెన్ తుషాన్ భిండితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న రెండేళ్లకు.. 2021 మే 5న బ్రిస్బేన్ లో ఎవెలిన్ వివాహమాడింది. ఇక అదే ఏడాది నవంబర్ లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఇదిలా ఉండగా.. తాజాగా తాను రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న వార్తను ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసి.. రెండో బేబీ కూడా రాబోతుందని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఎవెలిన్ మరోసారి తల్లి కాబోతుందని తెలిసి.. నెటిజన్స్, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవెలిన్ కి సంబంధించి బేబీ బంప్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి సాహూ బ్యూటీ సెకండ్ టైమ్ గుడ్ న్యూస్ చెప్పి సర్ప్రైజ్ చేయడంతో ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.