లైంగిక వేధింపులు మహిళలకు ఎక్కడైనా ఎదురుకావొచ్చు. సినీ ఇండస్ట్రిలో కూడా అలాంటి వేధింపుల ఎదుర్కొన్నట్లు కొందరు మహిళలు చెప్తుంటారు. కొందరు వ్యక్తులు అనేక రకాలుగా వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తుంటారని కొందరు నటీమణలు.. తమ ఆవేదను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ‘కలర్ ఫోటో’ మూవీ లో నటించిన చాందినీ చౌదరీ కూడా ఇండస్ట్రీలో తనకు జరిగిన చేదు అనుభవం గురించి ఓ షోలో తెలిపింది. తనని, తన కుటుంబాన్ని ఇండస్ట్రీలో కనిపించకుండా చేస్తాన్ని ఓ నిర్మాత బెదిరించినట్లు ఆమె తెలిపింది.
‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న.. ‘ఆలీతో సరదగా’ అనే కార్యక్రమానికి వీరిద్దరు అతిధులుగా వెళ్లారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అనేక విషయాలు ఆలీతో షేర్ చేసుకున్నారు. ఈక్రమలో చాందినీ చౌదరి.. తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు జరిగిన ఓ అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఓ సినిమా కోసం ఓ పెద్ద నిర్మాతతో ఒప్పదం చేసుకున్నామని, అయితే ఆ తర్వాత కొన్ని కారణా ల వల్ల బయటకు రావాల్సి వచ్చిందని, దీంతో ఆ నిర్మాత తనతో చాలా రూడ్ గా మాట్లాడడిని చెప్పింది. తనను తన కుటుంబాన్ని ఇండస్ట్రీలో కనిపించకుండా చేస్తాన్ని ఆ నిర్మాత బెదిరించినట్లు చాందీని తెలిపింది.
తనకు, తన కుటుంబానికి ఏమైన జరుగుతుందేమో అనే భయంతో అతడికి ఎదురు తిరగలేదని చెప్పింది. “నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు” అని ఆలీ అడగ్గా.. తనని తాను బ్యాకప్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరని, వాళ్లు తలుచుకుంటే చిటికెల్లో మసి చేసేస్తారు కదా! అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తనని బెదిరించిన నిర్మాతతో చేసుకున్న కాంట్రాక్ట్ కు విలువలేదని తర్వాత తెలిసిందని ఆమె వివరించింది. మరి.. హీరోయిన్ చాందినీ చౌదరి.. తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.