టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. ప్రమోషన్స్ అన్ని పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమైంది ఈ చిత్రం. కానీ అనూహ్య కారణాల వల్ల చివర్లో రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. దానికి కారణం ఏంటంటే?
టాలీవుడ్ లో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు ప్రేక్షకులను థియేటర్లలో పలకరిస్తుంటాయి. అయితే అందులో పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే.. చిన్న హీరోలు పక్కకు తప్పుకుని రెండు రోజుల తర్వాత తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. దానికి ప్రధాన కారణం థియేటర్లు దొరక్కపోవడమే. తాజాగా ఇదే సమస్య వస్తుందేమో అని ఓ కుర్ర హీరో తన సినిమాను ఒక్క రోజు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. మురళీ కృష్ణ అబ్బూరి దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన పోస్టర్స్ ను సైతం విడుదల చేశారు మేకర్స్. అయితే దానికి కారణం ఓ స్టార్ హీరో సినిమా కూడా అదే రోజు విడుదల కావడం అని అంటున్నారు. దానితో పాటుగా మరో సెంటిమెంట్ కూడా ఉందని తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం.. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో క్రేజీ ఫాలోయింగ్ ను సంపాదించుకుని వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. ఈ మూవీలో హీరోయిన్ గా కాశ్మీరా పరదేశీ నటిస్తోంది. ప్రముఖ బ్యానర్ అయిన గీతాఆర్ట్స్ 2పై నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల.. ప్రమోషన్స్ జరుపుకున్న తర్వాత సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన సినిమా 18న రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
వాయిదాకు ప్రధాన కారణం ఏంటంటే? 17వ తారిఖున స్టార్ హీరో ధనుష్ నటించిన సార్ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతోంది. దాంతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ఒక్క రోజు వెనక్కి తగ్గారు ఈ చిత్ర యూనిట్. ఇక రిలీజ్ వాయిదాకు మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గీతాఆర్ట్స్ కు శనివారం సినిమాలు రిలీజ్ చేస్తే బాగా కలిసొస్తుంది అన్న సెంటిమెంట్ ఉంది. దాంతో ఆ సెంటిమెంట్ ను కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మరి కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ సినిమా వాయిదా పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#VinaroBhagyamuVishnuKatha release date is pushed by a day to 18 February
U/A సర్టిఫికెట్ అందుకున్న “వినరో భాగ్యము విష్ణు కథ” ఫిబ్రవరి 18 న గ్రాండ్ రిలీజ్https://t.co/WPCuHthxVN#VBVK pic.twitter.com/lhmmBWF9VV
— idlebrain.com (@idlebraindotcom) February 11, 2023