సాధారణంగా ఇండస్ట్రీలో ఓ హీరోనో, హీరోయిన్నో కలిసి రెండు సినిమాలు చేస్తే చాలు.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనుకుంటారు జనాలు. అదీకాక దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియా ఒకటి. వారిద్దరు కలిసి ఏదో ఒక సందర్భంలో కెమెరా కంటికి చిక్కితే ఇక అంతే సంగతులు వారికి పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తనపై వచ్చిన ఇలాంటి రూమర్స్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెదవి విప్పింది హీరోయిన్ అంజలి. కెరీర్ మెుదట్లో తాను నటించిన హీరోతో రిలేషన్ లో ఉన్నట్లు వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది అంజలి.
అంజలి.. తెలుగు అమ్మాయే అయినప్పటికీ కోలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది. తన నటనతో వరుసగా తెలుగులో ఆఫర్లు దక్కించుకుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, బలుపు, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనకు గాను ప్రశంసలు అందుకుంది. అయితే కెరీర్ మెుదట్లో హీరో జై తో కలిసి ‘జర్నీ’, ‘బెలూన్’ చిత్రాల్లో నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండటంతో.. అప్పట్లో ఈ జోడీకి మంచి పేరు వచ్చింది. అదే టైమ్ లో వీరు డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అప్పట్లో కొన్ని ప్రమోషన్ కార్యక్రమాల్లో అంజలి – జై లు కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. వీరి బంధాన్ని చూసిన వారంత త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని భావించారు కానీ కొన్ని రోజుల తర్వాత వీరిద్దరు బ్రేకప్ చెప్పుకుని అందరిని షాక్ కు గురిచేశారు.
అయితే ఈ మధ్య కాలంలో అంజలి పెళ్లి, ప్రేమ వ్యవహారాల గురించి ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటికి సమాధానలు ఇచ్చింది. అంజలి మాట్లాడుతూ..”గతంలో నేను ఓ టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నాను. అప్పుడు ఆ రిలేషన్ పై నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ అది నేను అనుకుంత అందంగా లేదని తెలిసి దానికి ఎండ్ కార్డ్ వేశాను. ఇక నేను ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని ఎప్పుడూ.. ఎక్కడా చెప్పలేదు. నాకు పరిశ్రమలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారితో ఎలా ఉండాలనేది నా వ్యక్తిగత విషయం” అంటూ చెప్పుకొచ్చింది అంజలి. ప్రస్తుతం అంజలి పలు భాషల్లో సినిమాలు చేస్తూ.. మరో వైపు స్పెషల్ సాంగ్స్ లల్లో ఆడిపాడుతోంది.