తమిళంలో కెరీర్‌ను మొదలు పెట్టి తెలుగులో టాప్ హీరోయిన్గా మారిన తెలుగుమ్మాయి అంజలి. ఈమె దాదాపు తెలుగులోని స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. రెండు భాషల్లోనూ నటన పరంగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ బిజీ అయిపోయారు. వెబ్ సిరీస్‌లతో తరచుగా ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఆమె తాజా వెబ్ సిరీస్ ‘‘ఫాల్’’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ముద్దు సీన్లతో పాటు పలు ఇంటిమేట్ సీన్లలో నటించటం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. టాక్సిక్ రిలేషన్షిప్ గురించి కూడా చెప్పుకొచ్చారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి ముద్దు సీన్ గురించి చెబుతూ ‘ముద్దు సీన్‌ను క్లాస్‌గా తీస్తాను. మీకు అది ఒకేనా?’ అని అడిగాడు. అప్పుడు నేను ఫస్ట్ అడిగింది.. ‘మ్మూచా.. కిస్సా?’’ అని. నా క్వశ్చన్స్‌లో నాకు క్లారిటీ ఉండాలి కదా!. కొన్ని ఇంటిమేట్ సీన్లలో నటించినపుడు క్యారవాన్‌లోకి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. మనకు ఇష్టం లేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవటం మనకు ఇబ్బంది. అది కూడా అంత మంది ముందు.. లిమిటెడ్ క్రూ అయినప్పటికి అది మన వల్ల కాదు’’ అని చెప్పుకొచ్చారు. యాంకర్ టాక్సిక్ రిలేషన్షిప్ గురించి క్వశ్చన్ వేయగా.. ‘‘ నేను కూడా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నాను. రిలేషన్షిపా లేక కెరీరా అన్న పరిస్థితి వచ్చిందంటే..
అది కచ్చితంగా టాక్సిక్ రిలేషన్షిప్. ఓ అబ్బాయి వచ్చి పెళ్లి తర్వాత నువ్వు పని చేయకూడదు అని అంటే.. అది వాళ్లు ఏ ఉద్ధేశ్యంతో చెబుతున్నారన్నది కూడా ఓ విషయం. నువ్వు ఏమీ పనిచేయాల్సిన అవసరం లేదు.. మొత్తం నేనే చేస్తా అని అన్నప్పుడు కూడా ఆ అమ్మాయి పోయి పని చేయవచ్చు.. అది ఆమెకు నచ్చినపుడు’’ అన్నారు. తర్వాత పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘ నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. ఓ మంచి అబ్బాయిని’’ అని అన్నారు. మరి, హీరోయిన్ అంజలి ఇంటిమేట్ సీన్ల గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.