చిత్రపరిశ్రమలో గ్లామర్ అనేది ఓ భాగం. హీరోయిన్స్ విషయంలో సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఈ గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే నటనతో పాటు.. కథ డిమాండ్ బట్టి, హీరోయిన్స్ గ్లామర్ ని కూడా ఒలికించాల్సి ఉంటుంది. అయితే.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్లిక్ అవ్వాలంటే యాక్టింగ్ టాలెంట్, గ్లామర్ లతో పాటు కాస్తంత లక్కు కూడా కలసి రావాల్సి ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ డెబ్యూతోనే క్లిక్ అవుతుంటారు.. ఆ తర్వాత సినిమాల ఎంపిక కరెక్ట్ గా ఉంటే హీరోయిన్స్ గా స్టార్డమ్ ని చూస్తారు. ఇంకొంతమంది ఎన్ని సినిమాలు చేసినా లక్కు కలిసి రాకనో, కథల ఎంపిక సరిగ్గా లేకనో క్లిక్ అయ్యేందుకు కొన్నేళ్లు పడుతుంది.
ఆ తర్వాత కూడా క్లిక్ అవుతారనే గ్యారంటీ లేదు. ఇదంతా మొదటి నుండి హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వాలనే బ్యూటీల వెర్షన్. కానీ.. ఇండస్ట్రీలో కొన్నిసార్లు అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. డాక్టర్స్ యాక్టర్స్ అయినట్లు.. సింగర్స్ కూడా హీరోయిన్స్ అయిపోతుంటారు. అలా సింగర్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న గ్లామరస్ బ్యూటీ ఆండ్రియా జెరెమియా. తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ.. తమిళ ప్రేక్షకులకు ఆండ్రియా బాగా తెలుసు. తెలుగు వారికి మాత్రం ఎక్కువగా సింగర్ గా తెలుసు. అయితే.. పాటలు పాడుతూ కెరీర్ స్టార్ట్ చేసినా.. యుగానికి ఒక్కడు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది ఆండ్రియా.
ఆ తర్వాత చాలామంది హీరోల సరసన సినిమాలు చేసింది. కానీ.. పెద్దగా సక్సెస్ లు లేకపోవడంతో, మరోవైపు లవ్ లో కూడా ఫెయిల్ అవ్వడంతో ఎందులోనూ నిలకడను మెయింటైన్ చేయలేకపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ, ఇంకా బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆండ్రియా.. ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతున్న సమయంలో గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను ఊరిస్తోంది. తాజాగా ఆండ్రియా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ.. గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. ప్రెజెంట్ ఆ పిక్స్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ అంతా లవ్ సింబల్స్ తో రియాక్ట్ అవుతున్నారు. మరి ఆండ్రియా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.