ప్రస్తుతం విశ్వక్ స్వీయ దర్శకత్వంలో 'దాస్ కా ధమ్కీ' అనే చిత్రం ద్వారా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న విశ్వక్ కు అనుకోని ప్రశ్న ఎదురైంది. అర్జున్ సినిమా వివాదంలో.. మీరు ఆయనకు డబ్బులు తిరిగి చెల్లించారా? అని విలేకరి ప్రశ్నకు విశ్వక్ సమాధానం ఇచ్చాడు.
ఇండస్ట్రీలో ఓ మూవీ రిలీజ్ కావాలి అంటే ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని రావాల్సి ఉంటుంది. కొన్ని సినిమాలు అంతా పూర్తి అయినా గానీ ప్రసాద్ ల్యాబ్ లోనే మూలుగుతుంటాయి. ఇక మరికొన్ని చిత్రాలు స్టార్టింగ్ లోనే బ్రేక్ అవుతుంటాయి. ఇక ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకుని నిలిచిపోయిన సినిమా ఏది అంటే అది అర్జున్ సర్జా.. విశ్వక్ సేన్ సినిమా అనే చెప్పుకోవాలి. ఈ సినిమాపై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. ఇక ప్రస్తుతం విశ్వక్ స్వీయ దర్శకత్వంలో ‘దాస్ కా ధమ్కీ’ అనే చిత్రం ద్వారా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంటూ పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న విశ్వక్ కు అనుకోని ప్రశ్న ఎదురైంది. అర్జున్ సినిమా వివాదంలో.. మీరు ఆయనకు డబ్బులు తిరిగి చెల్లించారా? అని విలేకరి ప్రశ్నకు విశ్వక్ సమాధానం ఇచ్చాడు.
విశ్వక్ సేన్.. వరుస సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్, అశోకవనంలో అర్జున కళ్యాణం, పాగల్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక తన యాటీట్యూడ్ తో మాస్ ప్రేక్షకులకు మరింతగా చేరువైయ్యాడు. ఇక విశ్వక్ నటిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఉగాది కానుకగా మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు విశ్వక్. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది విశ్వక్ కు. అర్జున్ సర్జా సినిమా నుంచి తప్పుకున్న తర్వాత మీరు అతనికి తిరిగి డబ్బులు చెల్లించారా? అని విలేకరి ప్రశ్నించగా..
విశ్వక్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.”దాని గురించి మాట్లాడ్డానికి ఇది సమయమూ కాదు.. సందర్భమూ కాదు. అందుకే ఆ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక ఎంతో మందిపై ఉన్న గౌరవంతోనే నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు” అంటూ వివరణ ఇచ్చాడు విశ్వక్. ఇక ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి విశ్వక్ ఆసక్తికనబర్చలేదు. మరి అర్జున్ తో వివాదంలో విశ్వక్ ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.