విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో.. ఈ వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా జరిగిన రానా నాయుడు ప్రీమియర్ షో కార్యక్రమంలో వెంకటేష్ నోరుజారారు.
కరోనా కాలం నుంచి ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటుపడ్డారు. దాంతో కుప్పలు తెప్పలుగా ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు చూడటం అలవాటు చేసుకున్నారు. దాంతో హీరోలు సైతం వెబ్ సిరీస్ ల్లో నటించడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో.. ఈ వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ ఉండటంతో.. ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా జరిగిన రానా నాయుడు ప్రీమియర్ షో కార్యక్రమంలో వెంకటేష్ నోరుజారారు.
ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా రానా నాయుడు స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది.ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఈ సిరీస్ ప్రీమియర్ ను ప్రదర్శించారు. ఈ షోకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వచ్చారు. మెుత్తం 10 ఎపిసోడ్ లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాల నుంచి 50 నిమిషాల నిడివిని కలిగి ఉన్నాయి. రానా నాయుడు హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్, ఇంగ్లీష్, స్పానిష్ ఆడియోతో అందుబాటులో ఉంది. ప్రీమియర్ షోలో వెంకటేష్ మాట్లాడుతూ..”రానా నాయుడు ఓ డార్క్ ఫ్యామిలీ డ్రామా. ఈ వెబ్ సిరీస్ లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. హింస, సె*క్స్ కూడా ఉన్నాయి. ఇక నెట్ ఫ్లిక్స్ టీమ్ చాలా నిజయతీగా వర్క్ చేసింది. మీరు మీ ఇంట్లో లాప్ టాప్, సెల్ ఫోన్ లో ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే.. మీ ఫేస్ ల్లో ఎక్స్ ప్రెషన్స్ మారుతుంటాయి” అని తనదైన హవభావలతో చెప్పాడు.
ఇందులో సె*క్స్ కూడా ఉంటుంది అని వెంకటేష్ చెప్పగానే అందరు ఒక్కసారిగా నవ్వారు. వెంకీ కూడా అయ్యో చెప్పేశానా అని నవ్వుతూ అభిమానులను అలరించాడు. ఇక ఈ సిరీస్ లో ప్రతీ ఒక్కరు అద్భుతంగా నటించారని, ఇది రానా షో అని ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తే.. క్షమించండి అని వెంకటేష్ అన్నాడు. ఇక గురువారం అర్ధరాత్రి తర్వాత స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుందని అభిమానులు ఎదురుచూశారు. కానీ అనుకోని కారణాల వల్ల శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత రానా నాయుడు స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం వెంకీ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.