ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యతో విడాకుల తీసుకుంటున్నారంటూ వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు ఇద్దరు కూడా అధికారికంగా ఎలాంటి సమాధానం చెప్పింది లేదు. ఇక ఈ అంశాన్ని అంటుంచితే బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవల కాలంలో సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో నటించి తన నటనతో అదరగొడుతోంది. ఇక విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది సమంత. అయితే ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో సమంత నటనతో మెప్పించిందని, ఈ సిరీస్ లో సమంత నటన అద్భుతమంటూ షాహిద్ కపూర్ ప్రశంసలతో ముంచెత్తాడు. నటనతో ఆకట్టుకుంటున్న సమంత నాకు ఓ అవకాశం ఇస్తే నటించాలనుందని తెలిపాడు.
Totally loved her on the show. Would love to work with her some time. https://t.co/KhFS9BUclH
— Shahid Kapoor (@shahidkapoor) September 27, 2021