తెలుగు ఇండస్ట్రీలో వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి సహా పలు చిత్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సామ్రాట్రెడ్డి. ఆ తర్వాత ‘బిగ్బాస్’ రియాల్టీ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా నటుడు సామ్రాట్ రెడ్డి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా పలు చిత్రాల్లో నటించిన సామ్రాట్ కి గతంలో హర్షితా రెడ్డి అనే యువతితో వివాహం జరిగింది. కానీ కొద్ది కాలంలోనే ఈ జంట విడిపోయారు. ఆ తర్వతా 2020 కాకినాడకు చెందిన అంజనా శ్రీలిఖిత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆగస్టు 15న సామ్రాట్ సతీమణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని ఆయన తన ఇన్ స్ట్రాగామ్ లో అభిమానులకు తెలిపారు.
‘ఇండిపెండెన్స్ రోజుని ఇంత ఆనందంగా గడుపుతానని నేను అనుకోలేదు.. నా ముద్దుల కూతురుకి దీవెనలు’ అంటూ సామ్రాట్ తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన సామ్రాట్ దంపతులకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.