ఆకలికి రుచి, పచి ఉండదట. ఆకలికి స్టార్ల, సామాన్యులా అని కూడా ఉండదు. ఆకలి వేస్తే తాము సాధారణ వ్యక్తులమేనని నిరూపించారు అల్లు అర్జున్. పుష్ప షూటింగ్ టైమ్ లో ఓ రోడ్డు పక్కన ఉన్న హోటల్ లో టిఫిన్ చేసిన సంగతి విదితమే. అప్పట్లో అది వైరల్ గా కూడా మారింది. తాజాగా మరో నటుడు తిరుపతిలో హల్ చల్ చేశాడు.
మన టాలీవుడ్ నటీ నటులు ఎంతో డౌన్ టు ఎర్త్ గా ఉంటారు. అందుకే టాలీవుడ్ నటీనటులకు, టెక్సీషియన్లకు బాలీవుడ్ సైతం సెల్యూట్ చేస్తోంది. ఇక్కడి నటులకు సైతం తాము సెలబ్రిటీలమన్న గర్వం ఉండదు. ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు, షికార్లకు వెళుతుంటారు. సామాన్యులుగా ఉండేందుకు ఇష్టపడతారు. అదే విధంగా తినాలనుకున్నప్పుడు చిన్న హోటలా, పెద్ద హోటలా అని చూడరు. అందుకు ఉదాహరణ అల్లు అర్జున్. పుష్ప షూటింగ్ సమయంలో ఓ రోడ్డు పక్కన ఉన్న హోటల్ లో టిఫిన్ చేసి.. బిల్లు చెల్లించారు. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం అది. తాజాగా మరో టాలీవుడ్ నటుడు రోడ్డు సైడ్ హోటల్ లో సందడి చేసి.. టిఫిన్స్ రుచి చూశారు.
ఆశీష్ విద్యార్థి.. తెలుగు తెరకు సుపరిచతమైన నటుడు. తన విలనిజంతో కట్టిపడేస్తారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. ఇలా దాదాపు అన్ని భాషల సినిమాల్లో నటించారు. పోకిరిలో ఆయన నటనకు ఫిదా కాని వారుండరు. ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ చేసిన ఆయన ఇప్పుడు కొత్త జోనర్ లోకి వస్తున్నారు. ఇటీవల సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మ భూషణ్ లో విభిన్న పాత్రను పోషించారు. ఆయనలో మరో కోణం కూడా ఉంది. ఆశిష్ ట్రావెలర్, ఫుడీస్ట్. రోడ్ సైడ్ హోటల్స్, స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఆయన చాలా ఇష్టపడతారు. ఆ వీడియోలను తన యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతూ ఉంటారు. తాజాగా ఆయన తిరుపతిలో సందడి చేశారు. తిరుపతి కరకంబాడి వద్ద ఓ రోడ్ సైడ్ హోటల్ లో కనిపించారు. దీని పేరు దుర్గా హోటల్. ఇక్కడ దోసె, గారి టేస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టా లో పోస్ట్ చేశారు.
ఈ రోజును వేడి వేడి దోసెతో స్టార్ట్ చేశాను.. అంటూ కామెంట్స్ జత చేశారు. గారి భలే క్రిస్పీగా ఉందని చెప్పారు. దోసె చాలా కారంగా ఉందని, నార్త్ లో ఇలాంటి టేస్ట్ దొరకదనీ అన్నారు. ఆ హోటల్ సిబ్బందిని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆశిష్ బాలీవుడ్ లో ఖుఫియా అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తోన్నారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఎస్కేప్ టు నౌవేర్ అనే నవల ఆధారంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. అమర్ భూషణ్ రాసిన నవల ఇది. టబు, అలీ ఫజల్, వామిక గుబ్బి.. ఇతర కీలక పాత్రలను పోషిస్తోన్నారు. ఈ ఏడాది జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త కొత్తగా ట్రై చేస్తుంటారు. బెంగాలీ ఫేమస్ రసగుల్లాను టీతో ట్రై చేశారు. ఇదో కొత్త రకం అనుభూతిని ఇచ్చిందంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఆయన వీడియోలు వైరల్ గా మారుతుంటాయి కూడా. తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.