‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ మొత్తం ఎమోషన్స్‌తో నిండిపోయింది. తమ వారి నుంచి వచ్చిన లేఖలు పొందిన వారు ఆనందంతో ఉంటే .. వారి వాళ్లు పంపిన లేఖలు కళ్ల ముందే ముక్కలు అయిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్న వారు కొందరు. బిగ్ బాస్ ఎమోషనల్ డ్రామా ప్లాన్ చాలా బాగా క్లిక్ అయ్యింది. తాను టాన్స్జెండర్గా మారిన తర్వాత ప్రియాంక సింగ్‌కు తన తల్లిదండ్రుల నుంచి మొదటిసారి లేఖ వచ్చింది. అందుకే లోబో త్యాగం చేసి ఆమెకు ఒక అన్నగా లేఖను ఇస్తాడు. అందరూ లోబో చేసిన పనికి ఫిదా అయిపోయారు. మరోవైపు యాంకర్ రవి కూడా సింగర్ శ్రీరామ్ కోసం తన లేఖను త్యాగం చేస్తాడు. ఇలా హౌస్ మొత్తం కన్నీళ్లు, ఆనంద భాష్పాలతో నిండిపోయింది.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లో తల్లిని తలుచుకుని కన్నీటిపర్యంతం అయిన షణ్ముఖ్..
బిగ్ బాస్ కాన్సెప్ట్ ఒక్క తెలుగులోనే కాదు దాదాపు ప్రారంభమైన అన్ని భాషల్లోనూ హిట్ అయ్యింది. తాజాగా కొన్ని రోజుల క్రితం తమిళ్ బిగ్ బాస్ మొదలైన విషయం తెలిసిందే. అందులోనూ తమ అభిమాన కంటెస్టెంట్లు, వారి మిత్రుల కోసం బయట ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రానా భార్య మిహికా బజాజ్ తన మిత్రురాలి కోసం ఒక వీడియో చేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘నాకు ఎంతో ఇష్టమైన నా ఫ్రెండ్ అక్షరా రెడ్డి బిగ్ బాస్ హౌస్‌లో ఉంది. ఆమెను గెలిపించండి’ అంటూ మిహికా ఒక వీడియో చేసింది. అక్షరా ఒక మోడల్.. అంతేకాదు 2019 మిస్ గ్లోబల్ విజేత కూడా. రానా భార్య చేసిన రిక్వెస్ట్ కాబట్టి సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.