సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు.. సినిమా చరిత్ర మొదలైన నాటి నుంచి సినిమా వాళ్ల మధ్య ప్రేమ వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ వివాహాలు చాలా కామన్..
తమిళ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో అజిత్-షాలినిల జంట కూడా ఒకటి. ఈ జంట సినిమా కారణంగా కలుసుకుని ప్రేమ వివాహం చేసుకుంది. 1999లో వీరి ప్రేమ కథ ఓ యాక్సిడెంట్ ద్వారా చిగురించింది. ఈ ఇద్దరూ కలిసి ‘అమరకలమ్’ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో నటించటానికి షాలిని మొదట ఒప్పుకోలేదు. తాను చదువుకోవాలని ఆమె చెప్పారు. నిర్మాత, దర్శకుడు పట్టుబట్టి ఆమెను ఒప్పించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అజిత్ కారణంగా షాలిని మణికట్టుకు గాయం అయింది. ఆమె షూటింగ్‌కు బ్రేక్ తీసుకుంది. తన కారణంగా షాలినికి గాయం అవ్వటంతో అజిత్ బాధపడ్డాడు. తరచుగా ఆమెకు ఫోన్ చేస్తూ ఆమె ఆరోగ్యం గురించి ఎక్వైరీ చేయటం మొదలుపెట్టాడు.
దీంతో ఇద్దరి మధ్యా స్నేహం మొదలైంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమ గురించి ఇండస్ట్రీ మాట్లాడుకోసాగింది. మీడియా కథనాలు రాయటం మొదలుపెట్టింది. వీటి గురించి తెలుసుకున్న దర్శకుడు, నటుడు రమేష్ ఖన్నా అజిత్‌కు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘నీ గురించి, షాలిని గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోవద్దు. ఆమెకు దూరంగా ఉండు’ అని అన్నారు. అయితే, ఇద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారన్న సంగతి ఆయనకు తెలీదు. వీరి ప్రేమ గురించి తెలిసిన తర్వాత ఆయన సంతోషించారు.
పెళ్లికి వెళ్లి ఇద్దర్నీ ఆశీర్వదించారు. 2000 సంవత్సరంలో ఇద్దరికీ పెళ్లయింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కుటుంబాన్ని చూసుకోవటంలో బిజీ అయిపోయారు. పెళ్లి తర్వాత అజిత్‌కు వరుస హిట్లు పడ్డాయి. స్టార్ హీరోగా మారిపోయారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన తాజాగా చిత్రం తునివు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరి, అజిత్-షాలిని ప్రేమ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.