అతడు తెలుగులో యంగ్ హీరో. హీరో అని మాత్రమే కాకుండా సహాయ పాత్రలు, విలన్ తరహా రోల్స్ లో నటించి ఆకట్టుకుంటున్నాడు. తాను తండ్రి కాబోతున్నట్లు చెప్పి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.
టాలీవుడ్ యంగ్ హీరో గుడ్ న్యూస్ చెప్పాడు. అది కూడా వాలంటైన్స్ డే రోజున. ఆ ఫొటోలని కూడా షేర్ చేశాడు. ‘అందాల రాక్షసి’ మూవీతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర.. ఆ తర్వాత హీరోగా అని మాత్రమే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లో యాక్ట్ చేస్తూ మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేశాడు. అందుకు సంబంధించిన 10 ఫొటోల్ని షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్, సహా నటీనటులు విషెస్ చెబుతున్నారు.
ఇక నవీన్ చంద్ర కెరీర్ విషయానికొస్తే.. కర్ణాటకలోని బళ్లారిలో పుట్టిన నవీన్ చంద్ర ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. తొలి మూవీతో ఆకట్టుకున్న అతడు.. ఆ తర్వాత హీరోగా చేసినప్పటికీ హిట్ అయితే కొట్టలేకపోయాడు. నాని ‘నేను లోకల్’తో ప్రతినాయక లక్షణాలున్న రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ‘అరవింద సమేత’లోనూ జగపతిబాబు కొడుకుగా మెప్పించాడు. అనంతరం తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
గతేడాది కూడా గని, విరాటపర్వం, రంగరంగ వైభవంగా, అమ్ము, రిపీట్ లాంటి సినిమాలతో అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో ఆడియెన్స్ ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా తన భార్య ఒర్మ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పడమే కాదు త్వరలో తండ్రి కాబోతున్నాననే విషయాన్ని రివీల్ చేశాడు. అయితే నవీన్ చంద్ర పెళ్లి జరిగినట్లు చాలామందికి తెలీదు. గతంలో అతడి భార్య గురించి తెలిసినప్పటికీ.. నెటిజన్స్ చాలామంది బహుశా ఆమెని చూడటం ఇదే తొలిసారి అయ్యింటుంది. మరి నవీన్ చంద్ర పోస్ట్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.