అభిమాన సెలబ్రిటీల నుండి గుడ్ న్యూస్ అనేది ఎప్పుడైనా, ఎలాగైనా రావచ్చు. జనరల్ గా హీరోలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొడితేనే సంతోషించే ఫ్యాన్స్.. అదే హీరో పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడంటే.. ఇది కూడా సంతోషించాల్సిన విషయమే. తాజాగా టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర తండ్రి అయ్యాడు.
ఇండస్ట్రీలో అభిమాన సెలబ్రిటీల నుండి గుడ్ న్యూస్ అనేది ఎప్పుడైనా, ఎలాగైనా రావచ్చు. జనరల్ గా హీరోలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొడితేనే సంతోషించే ఫ్యాన్స్.. అదే హీరో పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడంటే.. ఇది కూడా సంతోషించాల్సిన విషయమే కదా! తాజాగా టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర తండ్రి అయ్యాడు. ఆయన భార్య బుధవారం (ఫిబ్రవరి 22న) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్ ని నవీన్ చంద్ర.. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపాడు. పుట్టిన బాబును ప్రేమగా చేతిలోకి తీసుకున్న ఫోటో షేర్ చేస్తూ.. ‘మాకు బాబు పుట్టాడు’ అని తన ఆనందాన్ని పోస్ట్ లో వెలిబుచ్చాడు.
దీంతో ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నవీన్ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నవీన్ తన బాబుతో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నవీన్ చంద్ర కెరీర్ విషయానికి వస్తే.. హీరోగా అని మాత్రమే కాకుండా విభిన్న పాత్రలతో.. అందరు హీరోల సినిమాలలో నటిస్తున్నాడు. అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నవీన్, ఆ తర్వాత డిఫరెంట్ సినిమాలు, క్యారెక్టర్స్ తో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నాడు. అయితే.. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బయట పెట్టలేదు నవీన్.
ఇక గతేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా భార్య ఓర్మాని పరిచయం చేసిన నవీన్.. ఈ ఏడాది వాలెంటైన్ మంత్ లో గుడ్ న్యూస్ చెప్పడం విశేషం. ఇటీవలే భార్యతో కలిసి బేబీ బంప్ ఫోటోషూట్ లో కూడా పాల్గొన్నాడు. నటుడిగా అందాల రాక్షసి తర్వాత అరవింద సమేత, ఎవరు, విరాట పర్వం లాంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే.. మరోవైపు హీరోగా కూడా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా సినిమాలే కాకుండా ఓటిటి వెబ్ సిరీస్ లలో కూడా మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా కంటిన్యూ అవుతున్నాడు నవీన్. మరి ప్రస్తుతం ఈ నటుడు తండ్రైన ఆనందంలో ఉన్నాడు. మరి నవీన్ కి మీ తరపున విషెస్ ని కామెంట్స్ లో తెలియజేయండి.
Me and orma ❤️ Blessed with baby boy 👶!!!!❤️ pic.twitter.com/db2N21fZOh
— Naveen Chandra (@Naveenc212) February 22, 2023