తెలుగు చిత్ర పరిశ్రమలా తమిళ్ చిత్ర పరిశ్రమలో కూడా అందర్నీ తీసుకోవాలి. కేవలం తమిళ్ వాళ్లే పని చెయ్యాలి అనే ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటకు రావాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలుపై సీనియర్ నటుడు నాజర్ స్పందించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) ఈ సాయంత్రం (జూలై 27) నుండి ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన యాక్టర్ కమ్ డైరెక్టర్ పి.సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. జీ5 సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
మంగళవారం సాయంత్రం హైదరాబాద్, శిల్పకళావేదికలో ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. పవన్ తన స్పీచ్‌తో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ సినిమాల పేర్లు ప్రస్తావిస్తూ.. తారక్, చరణ్, ప్రభాస్, రానా వంటి హీరోలు ఎంతలా కష్టపడతారో చెప్తూ ఆ హీరోల అభిమానులను కూడా ఆకట్టుకున్నారు. అలాగే సముద్రఖని గురించి చెప్తూ.. ఆయన తనతో సినిమా చెయ్యాలని తెలుగు భాష నేర్చుకుని, తెలుగు స్క్రిప్ట్ చదవడం చూసి ఆశ్చర్యపోయానని, ఆయణ్ణి ప్రశంసిస్తూ.. త్వరలో తాను కూడా తమిళం నేర్చుకుని మాట్లాడతా అని చెప్పారు. ఈ వేదికపై నుండి తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి కొన్ని సూచనలు చేశారు పవన్.
ఇది కూడా చదవండి : ‘బ్రో’ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలా తమిళ్ చిత్ర పరిశ్రమలో కూడా అందర్నీ తీసుకోవాలి. కేవలం తమిళ్ వాళ్లే పని చెయ్యాలి అనే ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటకు రావాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలుపై సీనియర్ నటుడు, నడిగర్ సంగం అధ్యక్షుడు నాజర్ స్పందించారు. ఇతర భాషల నటులను తమిళ్ ఇండస్ట్రీలోకి తీసుకోవడం లేదనే వార్తలను ఖండించారాయన.
‘’తమిళ చిత్ర పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే దాన్ని వ్యతిరేకిస్తాను. దీన్ని ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. తమిళ సినీ కార్మికుల రక్షణ కోసం సెల్వమణి కొన్ని సూచనలు చేశారు. తమిళ సినిమా పరిధిలో మాత్రమే మూవీ చేస్తున్నప్పుడు ఇక్కడి టెక్నీషియన్లు మాత్రమే కొంత వరకు ఎంకరేజ్ చేయండి అన్నారు. అంతే కానీ ఇతర భాషల నటులను వద్దని ఎవ్వరూ చెప్పలేదు.
ఇప్పుడన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. దీంతో పాటు ఓటీటీ వినియోగం కూడా ఎక్కువైంది. ఇలాంటప్పుడు అలాంటి నిబంధనలను ఎవరు తీసుకొస్తారు?. మిగతా పరిశ్రమల ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ ఆదరించింది, అక్కున చేర్చుకుంది. ఎస్వీ రంగారావు, సావిత్రి, వాణిశ్రీ, శారదమ్మ గారు ఇలా చాలామంది తమిళ్ వాళ్లే అనుకున్నాను. చాలా కాలం తర్వాత నాకు వాళ్లది ఆంధ్రప్రదేశ్ అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ ల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దాం’’ అన్నారు.