పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతుంటుంది. మూవీకి సంబంధించిన అప్‌డేట్ అయితే ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తుంటారు ఫ్యాన్స్. జనసేనాని, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతుంటుంది. మూవీకి సంబంధించిన అప్‌డేట్ అయితే ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తుంటారు ఫ్యాన్స్. జనసేనాని, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) మరో రెండు రోజుల్లో (జూలై 28) బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన యాక్టర్ కమ్ డైరెక్టర్ పి.సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. జీ5 సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
మంగళవారం సాయంత్రం హైదరాబాద్, శిల్పకళావేదికలో ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. పవన్ చాలా రోజుల తర్వాత సినిమా ఫంక్షన్లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గెస్టులుగా వచ్చారు. పవన్ తన స్పీచ్‌తో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ సినిమాల పేర్లు ప్రస్తావిస్తూ.. తారక్, చరణ్, ప్రభాస్, రానా వంటి హీరోలు ఎంతలా కష్టపడతారో చెప్తూ ఆ హీరోల అభిమానులను కూడా ఆకట్టుకున్నారు. పవన్ ఫ్రేమ్‌లో ఉన్నారంటే పక్కన ఎవరున్నా కనిపించరు. ఆయనే హైలెట్ అవుతారు. ఫోకస్ అంతా ఆయనే మీదే ఉంటుంది.
అలాగే ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చేతికి పెట్టుకొచ్చిన వాచ్ మీద ఫ్యాన్స్ దృష్టి పడింది. వెంటనే దాని పుట్టు పూర్వోత్తరాలు వెతికి తీశారు. ‘అత్తారింటికి దారేది’ లో సమంత ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’ అని చెప్పినట్టుగానే ఈ వాచ్ కాస్ట్ కూడా లక్షల్లో ఉంది. బ్రెగ్యుట్ మెరైన్ క్రోనోగ్రాఫ్ చేతి గడియారం ధరించారు. దీని ధర అక్షరాలా రూ. 21,45,678/-. గతంలోనూ పవన్ వాడే గాడ్జెట్స్ గురించి పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఆ లిస్ట్‌లో ఇప్పుడీ బ్రెగ్యుట్ వాచ్ కూడా చేరింది. పవన్ ఫ్యాన్స్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : మూవీ.. మూవీకి తగ్గుతున్న పవన్ క్రేజ్! ‘బ్రో’ కి మరీ దారుణం!