Nassar: ప్రముఖ నటుడు నాజర్ గాయపడ్డారు. షూటింగ్ సమయంలో ఆయన గాయాలపాలయ్యారు. తాజాగా, పోలీస్ అకాడమీలో ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. బుధవారం షూటింగ్ సమయంలో ఆయన గాయపడ్డారు. గాయాలతో ఉన్న ఆయన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. కాగా, ఈ మధ్య కాలంలో నాజర్ సినిమాలు చేయటం బాగా తగ్గించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఓ వార్త తమిళ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం. సినిమాలకు గుడ్‌బై చెప్పి, ఆరోగ్యంపై దృష్టిపెట్టడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై నాజర్ కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ, ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.