వినాయక చవితి రోజు సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి సినీ పెద్దలు, యువ హీరోలు అందరూ స్పందిస్తూనే ఉన్నారు. అందులో నటుడు నరేష్ మాట్లాడిన బైట్ బాగా వైరల్ అయ్యింది. సాయిధరమ్ తేజ్‌ని నేను హెచ్చరిస్తూనే ఉంటాను అన్న మాటలపై హీరో శ్రీకాంత్ స్పందించాడు. అందుకు శ్రీకాంత్ ఒక వీడియో చేసి పోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఆ బైట్‌పై నటుడు నరేష్ స్పదించాడు. ఆ వీడియోలో శ్రీకాంత్‌కు నరేష్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
శ్రీకాంత్ నా బైట్ నువ్వు మాట్లాడింది నేను చూశాను. ఏంటమ్మా అలా బైట్ ఇచ్చావ్.. అంటూ నరేష్ మాట్లాడాడు. ‘కచ్చితంగా సాయిధరమ్ తేజ్ జారి పడ్డాడు. ఆ సమయంలో వేగంగా లేడు. బురద వల్లే పడ్డాడు. నేను చెప్పిందానికి మీడియాలో కొంత తేడాగా వచ్చింది’ అని చెప్పారు. నరేష్ వ్యాఖ్యలపై పెద్దలు కొందరు తనకు చెప్పారని, దానిని వెంటనే సరిచేసుకున్నట్లు వివరించారు. ‘నేను చెప్పాల్సింది చెప్పాను. బైక్‌లను పిల్లలకు ఎవరూ చాక్లెట్లలా ఇవ్వరు. చనిపోయినవారిని ప్రస్తావిచంలేదు. సాధారణంగా చెప్పాను. నీ మాటలకు నేను హర్ట్ అయ్యాను. ఇంకెప్పుడు అలా బైట్ ఇవ్వకు’ అని నరేష్ చెప్పుకొచ్చాడు. తన కళ్లముందే హీరోగా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. మా ఎన్నికల్లో తన ఆపోజిట్ ప్యానల్‌లో పోటీ చేసి శ్రీకాంత్ ఓడిపోయిన విషయాన్ని కూడా నరేష్ ప్రస్తావించాడు. ఇంకెప్పుడు అలాంటి బైట్లు ఇవ్వొద్దంటూ సూచించాడు.