నరేష్-పవిత్రా లోకేష్ బయోపిక్ 'మళ్లీ పెళ్లి'.. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు తొలిరోజు మంచి వసూళ్లే వచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగులో ఈ మధ్య కాలంలో ఓ సినిమా కోసం జనాలు తెగ మాట్లాడుకున్నారు. రిలీజ్ కోసం వెయిట్ చేశారు. ఇది ‘మళ్లీ పెళ్లి’ విషయంలో జరిగింది. బహుశా ఏ ఇండస్ట్రీలో ఈ టైపు బయోపిక్ అస్సలు వచ్చుండదు. ఫ్యూచర్ లో రాకపోవచ్చు కూడా. దానికి తోడు రియల్ లైఫ్ కపుల్ నరేష్-పవిత్రా లోకేష్.. ఇందులో నిజ జీవిత పాత్రలు పోషించడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి తొలిరోజు ఎంత కలెక్షన్స్ వచ్చాయో తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ నటుడు నరేష్ లీడ్ రోల్ లో నటించి, నిర్మించిన ‘మళ్లీ పెళ్లి’ ఓ డిఫరెంట్ సినిమా. ఎందుకంటే ఈయన లైఫ్ లో ఏం జరుగుతుందో.. చాలామందికి తెలుసు. దాన్ని సినిమాగా తీసి అందరూ అవాక్కయ్యేలా చేశారు. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో గత కొన్నాళ్ల నుంచి ఆయనకు గొడవలు అవుతున్నాయి. నిజం సంగతి పక్కనబెడితే ఈ మూవీలో ఏకంగా ఆమెని పోలిన పాత్రని పెట్టి విలన్ గా మార్చేశారు. నరేష్-పవిత్రా లోకేష్ ది తప్పేం లేదు. మూడో భార్య వల్లే ఇదంతా జరుగుతుంది అన్నట్లు చూపించారు. ఇందులో ఎంత నిజముందో ఎవరికీ తెలియదు.
అయితే రిలీజ్ కి ముందే ‘మళ్లీ పెళ్లి’పై కాస్త బజ్ క్రియేట్ అయింది. థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో టికెట్స్ గట్టిగానే తెగాయి. తొలిరోజు ఏకంగా రూ.30 లక్షల వరకు గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. వీకెంట్ కాబట్టి ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ కోరుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ‘మళ్లీ పెళ్లి’కి వెళ్తారు. వీకెండ్ గడిచిన తర్వాత ఈ సినిమాకు లాభాలొచ్చాయా నష్టాలొచ్చాయా అనేది తెలుస్తుంది. మరి మీలో ఎవరైనా ‘మళ్లీ పెళ్లి’ చూశారా? ఒకవేళ చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.