నరేష్-పవిత్రా లోకేష్ 'మళ్లీ పెళ్లి' సినిమాకు చిక్కులు ఏర్పడ్డాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా కోర్టుకెళ్లింది. ఇంతకీ ఏం జరుగుతోంది?
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఇందులో స్టార్ నటీనటులు ఎవరూ లేరు. అయినా సరే ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారంటే దానికి రీజన్ నరేష్-పవిత్రా లోకేష్. రియల్ లైఫ్ లో కలిసుంటున్న వీళ్లు.. అదే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నరేష్ నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ట్రైలర్ లో కనిపించేసరికి అందరూ ఇదే ఆయన బయోపిక్ అని అంటున్నారు. నరేష్ మాత్రం ఇది మిడిల్ ఏజ్డ్ లవ్ స్టోరీ అని చెబుతున్నారు. సరిగ్గా రిలీజ్ కి ఒక్క రోజు మాత్రమే ఉందనగా.. ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయి. నరేష్ మూడో భార్య సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయనిర్మల వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన నరేష్, కెరీర్ ప్రారంభంలో హీరోగా చేశారు. ప్రస్తుతం బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నారు. వ్యక్తిగతంగా నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మూడో భార్య రమ్య రఘపతితో గత కొన్నాళ్ల నుంచి గొడవ జరుగుతోంది. విడాకులు విషయమై వీళ్లిద్దరూ కోర్టుకెళ్లడం, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడం లాంటివి చేస్తూ వచ్చారు. ఇప్పటికీ ఇది ఇంకా ఎటూ తేలలేదు. ఇలాంటి టైంలో నరేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయారు. ఇందులో రమ్య రఘపతి పోలిన పాత్ర ఉంది. వనితా విజయ్ కుమార్ ఆ రోల్ లో యాక్ట్ చేసింది.
దీంతో ‘మళ్లీ పెళ్లి’ రిలీజ్ కి ఒకరోజు ముందు సరిగ్గా రమ్య రఘపతి.. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించింది. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలని పిటిషన్ వేసింది. ఇందులో తన ప్రతిష్టని కించపరిచేలా సీన్స్ ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ వివాదానికి ఎప్పుడూ పుల్ స్టాప్ పడుతుందా అని నెటిజన్స్ వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో ‘మళ్లీ పెళ్లి’ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో అదనమాట విషయం. ఈ సినిమా రిలీజ్ విషయంలో నరేష్ మూడో భార్య కోర్టుకెళ్లడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.