ప్రముఖ సీనియర్ నటుడు కమల్ హాసన్ కు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనాతో పోరాడుతున్న ఆయన ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ప్రస్తుతం కమల్ హాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని డిసెంబర్ 3న డిశ్చార్జ్ చేయనున్నట్లు తాజా హెల్త్ బులిటెన్ లో వైద్యులు తెలిపారు.
అయితే కరోనా సోకిన నాటి నుంచి కమల్ హాసన్ కు తన కూతురు శ్రుతిహాసన్ ఎప్పటికప్పుడు తండ్రి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ ఉంది. అయితే ఇటీవల అమెరికాకు వెళ్లి తిరిగి వచ్చిన కమల్ హాసన్ కు ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులను సంప్రదించాడు. పరీక్షలు చేసిన వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్పటి నుంచి నటుడు కమల్ హాసన్ వైద్యుల సమక్షంలోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఇక తాజాగా పరీక్షలు చేసిన వైద్యులు నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.