ప్రముఖ బహుభాషా నటుడు అర్జున్ షార్జా కూతురు ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. ప్రముఖ నటుడి కుమారుడితో ఆమె పెళ్లి జరగబోతోందని సమాచారం.
యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా నటుడిగానే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తన సినీ ప్రస్తానంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన సినిమాలు చేశారు. సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో తన కూతురు ఐశ్వర్యను కూడా సినిమాల్లోకి తీసుకువచ్చారు. 2013లో వచ్చిన ‘పట్టతు యానయ్’ అనే తమిళ సినిమాతో ఐశ్వర్య సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘ప్రేమ బరాహ’ అనే కన్నడ సినిమా చేశారు. ప్రస్తుతం తండ్రి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్యకు సంబంధించి ఓ వార్త మీడియా సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. తమిళనాట పేరున్న హాస్యనటుడి కుమారుడ్ని పెళ్లి చేసుకోబోతున్నారట. ఐశ్వర్య తమిళ సీనియర్ హాస్య నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో గత కొంత కాలంగా రిలేషన్లో ఉన్నారట. పెళ్లి గురించి ఈ ఇద్దరు తమ ఇంట్లో వారితో చర్చించారట. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఓకే చెప్పారంట. త్వరలో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరగబోతోందని సమాచారం. అయితే, వీరిద్దరి పెళ్లి విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఉమాపతి కుటుంబంనుంచి గానీ, అర్జున్ కుటుంబం నుంచి గానీ, అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. కాగా, ఉమాపతి రామయ్య 2017లో వచ్చిన ‘అదగపాతుతు మగజనంగలే’ అనే సినిమాతో పరిశ్రమలోకి వచ్చారు. తమిళంలో ఇప్పటి వరకు నాలుగుకుపైక సినిమాలు చేశారు. సినిమాలతో ఓ టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం ‘దేవ్‌దాస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా నడుస్తోంది. మరి, అర్జున్ కూతురి పెళ్లి వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.