సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారంలోనే తెలుగు ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ కృష్ణ, పంజాబ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ పేరు తెచ్చుకున్న దల్జీత్ కౌర్ ఖంగురా కన్నుమూశారు.. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత బి హరికుమార్ తుదిశ్వాస విడిచారు. మలయాళంలో కామెడీ కింగ్ గా పేరుగాంచిన నటుడు అదూర్ భాసి మేనల్లుడు, సివి రామన్ పిళ్లై మనవడు బి హరికుమార్.
తిరువనంతపురంకు చెందిన హరికుమార్ మొదట బ్యాంకు అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత నటనపై మక్కువతో సినీ ఇండస్ట్రీ వైపు వచ్చారు. తన మేనమామ మాలీవుడ్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న అదూర్ భాసీ సహకారంతో పలు చిత్రాల్లో నటించాడు. హరికుమార్ భార్య పేరు శ్రీరేఖ, కుమాడు హేమంత్ ఉన్నారు. హరికుమార్ మలయాళ సాహిత్య సర్కిల్‌లో చురుకుగా ఉన్నారు. నటుడిగానే కాకుండా మంచి రచయితగా మాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు బి
హరికుమార్.
హరికుమార్ మంచి రచయితగా పేరు తెచ్చకున్న హరికుమార్ దాదాపు 14 నవలలు మరియు 100కి పైగా కథలు రాశారు. అంతేకాదు అదూర్ భాసిపై రెండు పుస్తకాలను కూడా ప్రచురించారు. ఆ పుస్తకాలకు ‘చిరియుడే తంపురన్’ , ‘అదూర్ భాసి ఫలితంగల్’ అనే పేరు పెట్టారు. హరికుమార్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక సెలబ్రెటీలు వరుసగా కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు.