సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట ఒక్కటైయింది. ‘రంగస్థలం’ సినిమాలో కుమార్ బాబుగా నటించి.. అందరిని మెప్పించి నటుడు ఆది పినిశెట్టి బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పారు. కోలీవుడ్ నటి నిక్కీ గల్రానీని ఆది పినిశెట్టి వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అతి తక్కువ మంది కుటుంబ సభ్యులతో, సన్నిహితులు సమక్షంలో జరిగిన ఈ వేడుకలో కొందరు టాలీవుడ్ హీరోలు సందడి చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఆది పినిశెట్టి వివాహానికి టాలీవుడ్ హీరోలు నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ హాజరయ్యారు. హల్దీ, సంగీత్ లలో వీరు డ్యాన్స్ చేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకి వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీ, ఇతర రంగాలకు చెందిన వారందరి కోసం ఈ కొత్త జంట త్వరలోనే వివాహం విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సీనియర్ స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆది.. తెలుగు, తమిళ భాషల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
కేవలం హీరోగానే కాకుండా ఇతర హీరోల సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం హీరో రామ్ పోతినేని నటిస్తున్న “ది వారియర్” సినిమాలో ఆది..విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఆది – నిక్కీ ఇద్దరూ కలిసి రెండు చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు టాక్. తాజాగా పెళ్లి బంధంతో వీరిద్దరి ఒక్కటయ్యారు. ఈ జంటకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆది –నిక్కీల పెళ్లిపై ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పెళ్లి పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ఇదీ చదవండి:గెటౌట్ అంటూ దేవి నాగవల్లిపై నరేష్ స్కిట్.. అనిల్ రావిపూడి రియాక్షన్ వైరల్!