ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘‘ విక్రమ్’’ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు! ఈ సినిమా ద్వారా లోకేష్ కనగరాజ్ తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కు శ్రీకారం చుట్టాడు. తాను గతంలో తీసి విజయం సాధించిన బ్రహ్మాండమైన సినిమా ‘‘ఖైదీ’’ని విక్రమ్ సినిమాతో లింక్ చేశాడు. అందులోని కొన్ని పాత్రలను ఇందులోకి తీసుకొచ్చాడు. అంతేకాదు! హీరో ప్రస్తావన కూడా తెచ్చాడు. దీంతో ఇకపై లోకేష్ తీయబోయే సినిమాలు మొత్తం ఎల్సీయూలోనే ఉంటాయని అర్థమైంది. ప్రస్తుతం లోకేష్ దళపతి విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా విజయ్ నటిస్తున్న 67వ సినిమా. ఈ సినిమా లోకేష్, విజయ్ కాంబోలో వచ్చిన ‘‘మాస్టర్’’కు సీక్వెల్‌గా ఉండనుందనే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి విజయ్ కుడి చేతికి కడియం ధరించి వచ్చారు. మాస్టర్ సినిమాలో విజయ్ కడియం ధరించి ఉండటంతో.. రెండు సినిమాలు ఒకటేనని అభిమానులు భావిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో భారీ తారాగణం కూడా ఉండనుందట. ఒకే సినిమాలో ఏకంగా ఏడుమంది స్టార్లు కలిసి నటించనున్నారట. విజయ్‌తోపాటు కమల్ హాసన్, సూర్య, కార్తీ, సంజయ్ దత్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌లు కనిపించనున్నారట.
విక్రమ్ సినిమాలో సూర్య గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినట్లు.. విజయ్ సినిమాలో మిగిలిన ఆరుగురు గెస్ట్‌గా రానున్నారట. ఇందుకు సంబంధించిన ప్రోమో షూట్ కూడా కంప్లీట్ అయిందట. ఏది ఏమైనప్పటికి ఇంత మంది స్టార్ హీరోలను ఒకే సినిమాలో చూడటం ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, విజయ్‌తో సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 తీయనున్నారు. ఆ తర్వాత విక్రమ్ 2 సినిమా తీయనున్నారు. ఇందుకు సంబంధించి ఎప్పుడో తీర్మానం జరిగిపోయింది. దళపతి 67 అయిపోగానే వరుసగా ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకోనున్నాయి. మరి, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KAMAL HAASAN – THALAPATHY VIJAY – SURIYA – KARTHI – VIJAY SETHUPATHI – FAHADH FAASIL – SANJAY DUTT in LCU#Thalapathy67 – Promo Shoot Done – #ThalapathyVijay in #LokeshKanagaraj Gangster Universe with #Karthi, #KamalHaasan, #FahadhFaasil, #VijaySethupathi, #Suriya, & #SanjayDutt
— Himesh (@HimeshMankad) December 12, 2022