30 Years Industry Prudhvi Raj: ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!’ డైలాగ్‌తో తెలుగులో ఓరేంజ్ పాపులారిటీ తెచ్చుకున్నారు నటుడు పృథ్వీరాజ్. డైలాగ్ పేరునే తన పేరులో చేర్చుకుని ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ’గా మారిపోయారు. కమెడియన్‌గా మంచి ఫాంలో ఉన్న టైంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున పని చేశారు. వైఎస్సార్ సీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధత్యలు చేపట్టారు. కానీ, ఓ వివాదం కారణంగా పార్టీనుంచి సస్పెండ్ అయ్యారు. ఇక ఆ తర్వాతినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో సరైన అవకాశాలు లేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఎన్నికల సమయలో మెగా ఫ్యామిలీని తిట్టినందుకు గతంలో ఓ సారి మెగా ఫ్యామిలీకి క్షమాపణ కూడా చెప్పారు.
ఇక అప్పటినుంచి మెగా ఫ్యామిలీకి, జనసేనకు కొంత సపోర్టుగానే మాట్లాడుతున్నారు. తాజాగా, ఓ న్యూస్ ఛానల్ డిబేట్‌లో జనసేన గెలుపుపై ఆయన మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కింగ్ అవుతారని ఆయన అన్నారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘‘ మీరు గెలవలేదు.. రెండు చోట్లా మీరు గెలవలేదు. రెండు చోట్ల ఏంట్రా మీ అమ్మా కడుపులు మాడా! పది చోట్ల మేం గెలిచి చూపిస్తాం. 40-50 సీట్లు జనసేన కొడతాది. దీని మీద అగ్రిమెంట్ రాసిస్తా. ప్రజల్లో మార్పు వచ్చింది. ఇది వాస్తవం.. వెళ్లిన చోటంతా మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఘంటా పథంగా 2024 ఎన్నికల్లో కింగ్ అయ్యేది పవన్ కల్యాణే’’ అని అన్నారు.కాగా, గతంలో ఓ వీడియోలో పృథ్వీ మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల నుండి మీతో మనసు విప్పి మాట్లాడాలని.. ప్రజలకు చేరువ కావాలని మదన పడుతున్నాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే.. నేను ఆర్ధికంగా, సినిమాల పరంగా చాలా నష్టపోయాను. నేను చేయాల్సిన సినిమాలు చేయలేకపోయాను. నన్ను ఎవరూ ఎంకరేజ్ చేయడం లేదు. రోల్స్ ఇవ్వడం లేదు. ఇది వాస్తవం. నాలాంటి వాడికి రాజకీయాలు పనికి రావు.
ముక్కుసూటిగా మాట్లాడేవాడికి పార్టీ అన్నా సపోర్ట్ చేయాలి లేదంటే వ్యక్తులైనా సపోర్ట్ చేయాలి. పార్టీ కోసం గొడ్డులా కష్టపడి పనిచేశా. చివరికి వాళ్లు తీసుకునే నిర్ణయాలు వాళ్లు తీసుకున్నారు. నాకు చాలా గొప్ప గుణపాఠం నేర్పించారు. నేను ఇప్పుడు చెప్తున్న మాటలు ఎవరి బలవంతంతోనే చెప్తున్నవి కాదు.. ఆత్మపరిశీలన చేసుకుని చెప్తున్న మాటలు’’ అని అన్నారు. మరి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మనల్ని తిట్టిన వాడే తిరిగి మన నిజాయతీ గురించి మాట్లాడితే ఉంటదిరా చారి ఆ కిక్కే వేరు 😎 @PawanKalyan 🔥 @JanaSenaParty pic.twitter.com/1pA9l8GKJS
— Ustaad Kiran (@Ustaad_Kiran) June 13, 2022
ఇవి కూడా చదవండి : Auto Ramprasad: సుధీర్ టీమ్ విడిపోవడం వెనుక అంత రచ్చ జరిగిందా?