గతేడాది యూట్యూబ్ వేదికగా విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ లలో ‘30 వెడ్స్ 21‘ ఒకటి. చైతన్యరావు – అనన్య భార్యాభర్తలుగా నటించిన ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంది. అయితే.. ఫస్ట్ సీజన్ ’30 వెడ్స్ 21’ మంచి విజయం సంధించేసరికి సిరీస్ నుండి రెండో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని కూడా ఎదురు చూస్తున్నారు.
ఈ సిరీస్ నిర్మాణ సంస్థ ‘ఛాయ్ బిస్కెట్’ ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ఫిబ్రవరిలో వాలంటైన్స్ డే సందర్భంగా రాబోతుందని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా సెకండ్ సీజన్ కి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ’30 వెడ్స్ 21′ టీజర్ సెకండ్ సీజన్ పై మంచి మంచి అంచనాలను క్రియేట్ చేసేలా ఉంది. పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ కి మహేష్.పి కథ అందిస్తున్నాడు. జోస్ జిమ్మీ సంగీతం అందిస్తున్నాడు. మరి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న 30 వెడ్స్ 21 సీజన్ 2 టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.