స్టార్ హీరోలు, హీరోయిన్స్ గురించి ఏ వార్త వచ్చినా సరే అభిమానులకు చాలా ఆసక్తి. ఎందుకంటే వాళ్ల లైఫ్ స్టైల్, డ్రస్సింగ్, డైలాగ్స్..ఇలా ఒకటేమిటి అన్నింటిని అనుకరించాలని చూస్తుంటారు. అలాంటిది వాళ్ల చిన్నప్పటి ఫొటోలు గనుక ఒకవేళ బయటకొస్తే ఊరుకుంటారా.. అస్సలు ఊరుకోరు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఫొటోనే ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకేచోట ఉండేసరికి ఫ్యాన్స్ ఆనందం తట్టులేకపోతున్నారు. కొందరు ఊహించి ఆన్సర్స్ చెప్పేస్తుండగా, మరికొందరు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. శరవణన్ శివకుమార్ తెలుసా అంటే చాలామంది ఆయన ఎవరు అంటారు. అదే సూర్య అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మధ్యే ‘విక్రమ్’ చిత్రంలో రోలెక్స్ గా అదిరిపోయే యాక్టింగ్ చేశారు. తాజాగా మంగళవారంతో ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో అన్న సూర్య గురించి తమ్ముడు కార్తి పోస్ట్ పెట్టారు. ‘తన ప్రతి మైనస్ ని గొప్ప ప్లస్ గా మార్చుకోవడానికి రాత్రిపగలు కష్టపడ్డాడు. తన సొంత విజయాలను అధిగమించడంపై మాత్రమే దృష్టిపెట్టాడు. ఒక వ్యక్తిగా వేలాది మంది పిల్లలను తీర్చిదిద్దాడు. అతడే నా అన్నయ్య’ అని గూస్ బంప్స్ తెప్పించే ట్వీట్ చేశాడు.
ఇక తమిళ నటుడు శివకుమార్ వారసుడిగా సూర్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ‘నెరుక్కు నేర్’ సినిమాతో తొలిసారిగా తెరపై కనిపించాడు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సూర్య.. ఆ తర్వాత కాలంలో ఉత్తమ నటుడు అనిపించుకున్నాడు. తమిళ్ మాత్రమే కాకుండా తెలుగులో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రయోగాలు చేయడంలోనూ ముందుండే సూర్య.. ‘విక్రమ్’లో రోలెక్స్ అనే వైలెంట్ విలన్ గా నటించాడు. క్లైమాక్స్ లో కేవలం ఐదు నిమిషాలే కనిపించి, వావ్ అనిపించాడు. ఇండస్ట్రీలో విజయవంతంగా 25 ఏళ్లు పూర్తిచేసుకున్న మరిన్నీ అద్భుతాలు చిత్రాలు తీయాలని సుమన్ టీవీ కోరుకుంటోంది. సూర్య సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: డిల్లీ, రోలెక్స్ ల ఫైట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసిన సూర్య, కార్తీ!
He worked day & night to make his every minus into his greatest plus. He focused only at outperforming his own achievements. As a person, he made his already generous heart even larger and shaped the lives of thousands of deserving kids. That’s my brother!#25YearsOfCultSuriyaism pic.twitter.com/5GELKdxGS0
— Actor Karthi (@Karthi_Offl) September 6, 2022