లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 1997లో ఓ చిత్రం ప్రారంభం అయ్యింది. కమల్ టైటిల్ పాత్ర పోషిస్తూ.. స్వీయ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అయితే మళ్లీ 26 సంవత్సరాల తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోందని సమాచారం.
సాధారణంగా ఓ సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అంటే అష్ట కష్టాలు పడాలి. కొన్ని సినిమాలు ప్రారంభంలోనే ఆగిపోతే.. మరికొన్ని చిత్రాలు సగం షూటింగ్ జరుపుకున్నాక మధ్యలోనే మరణిస్తాయి. ఇంకోన్ని చిత్రాలు రిలీజ్ కు సిద్ధమై కూడా ల్యాబ్ లల్లో మూలుగుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోయే చిత్రం వీటన్నింటి కంటే కాస్త విభిన్నమైనది. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 1997లో ఓ చిత్రం ప్రారంభం అయ్యింది. ఆ సినిమా పేరు మరుదనాయగన్. కమల్ టైటిల్ పాత్ర పోషిస్తూ.. స్వీయ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అతిరథ మహారథులు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో? మళ్లీ 26 సంవత్సరాల తర్వాత సెట్స్ పైకి ఎందుకు వెళ్లబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
కమల్ హాసన్.. బలనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించి, ఎన్నో గొప్ప క్యారెక్టర్లు వేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన విక్రమ్ సినిమాతో మళ్లీ గాడిన పడ్డాడు లోకనాయకుడు. భారతీయ సినీ పరిశ్రమలో కమల్ హాసన్ కు ఉన్న గుర్తింపు ఎలాంటిదో మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. మరి అలాంటి నటుడి సినిమా సగం షూటింగ్ జరుపుకుని ఆగిపోయిందని మీకు తెలుసా? అవును 1997లో కమల్ హీరోగా నటిస్తూ.. తనే స్వీయ దర్శకత్వం కూడా వచ్చిన సినిమా మరుదనాయగన్. 1997లో ప్రారంభం అయిన ఈ చిత్రం 40 శాతం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే బడ్జెట్ తో పాటుగా మరికొన్ని కారణాలతో ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయినప్పటికీ గతంలో చాలా సార్లు ఈ సినిమాను తప్పకుండా పూర్తి చేస్తానని, ఇది తన కలల సినిమాగా కమల్ చెప్పుకొచ్చాడు. అదీకాక ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ నిర్మాతలు పాలు పంచుకుంటారు అని తెలిపాడు.
ఈ క్రమంలోనే మళ్లీ 26 సంవత్సరాల తర్వాత మరుదనాయగన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే? కమల్ నటించిన పాత్రలో హీరో విక్రమ్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కమల్ హాసన్ నటించిన సన్నివేశాలను సినిమాలో చోటు చేసుకునేలా కథను మార్చినట్లు సమాచారం. ఇక మరుదనాయగన్ సినిమాను 26 ఏళ్ల తర్వాత సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రధాన కారణం,.. బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ లాంటి చిత్రాలు విజయాలు సాధించడమే. దాంతో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని కమల్ భావిస్తున్నాడట. అయితే ఇందుకు సంబంధించిన అధికారికి ప్రకటన విడుదల కావాల్సి ఉంది. మరి 26 ఏళ్ల తర్వాత కమల్ మూవీ సెట్స్ పైకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.