విక్రమ్ సినిమాలో అందరికీ బాగా నచ్చిన పాత్ర ఏదైనా ఉందా అంటే అది రోలెక్స్ పాత్ర. తాజాగా ఈ పాత్రతో వస్తున్న మూవీపై సూర్య క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.
తమిళ, తెలుగు భాషల్లో సమానమైన ఇమేజ్ ని అభిమానుల్ని సంపాదించిన నటుడు సూర్య. రెండు భాషల్లోను ఎంతో మంది ఫాన్స్ సూర్యకి ఉన్నారు. తాజాగా సూర్య తన అభిమానులతో ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసాడు. ఆ మీటింగ్ లో సూర్య తాను చేయబోయే సినిమా గురించి అప్ డేట్ ఇచ్చి తన అభిమానులతో పాటు అశేష సినీ ప్రేక్షకులందర్నీ ఆనందం లో ముంచెత్తాడు. ఇంక అసలు విషయంలోకి వెళ్తే..లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం లో కమల్ హాసన్ హీరోగా గత సంవత్సరం విడుదలైన విక్రమ్ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరకి తెలిసిన విషయమే. ఆ మూవీ చివరలో రోలెక్స్ అనే పవర్ ఫుల్ పాత్రలో సూర్య కనిపించి సినిమా హిట్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్లాడు.
మూవీలో సూర్య కనిపించింది కొన్ని నిమిషాలే అయినా రోలెక్స్ క్యారక్టర్ లో సూర్య ప్రదర్శించిన హావ భావాలు మామూలు స్థాయిలో లేవు. సూర్య ఫాన్స్ అయితే థియేటర్స్ మొత్తాన్ని తమ విజిల్స్ తో మారుమోగించారు. రోలెక్స్ క్యారక్టర్ లో సూర్య ని ఎంచుకోవడం ద్వారా విక్రమ్ మూవీ కి కొనసాగింపుగా రోలెక్స్ కథ తో కూడా సినిమా ఉంటుందని ఆ మూవీలో సూర్య నట విశ్వరూపం చూడవచ్చని సూర్య అభిమానులతో పాటు సాధారణ అభిమానులు ఫిక్స్ అయ్యారు. లోకేష్ కనగరాజ్ ఆ మూవీ లో ప్రధాన విలన్ పాత్ర విక్రమ్ దే అని సినిమాలో చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి సూర్య తన ఫాన్స్ తో పంచుకోవడం జరిగింది.
విక్రమ్ మూవీలో తాను పోషించిన రోలెక్స్ క్యారక్టర్ కి సంబంధించిన కథ లోకేష్ తనకు చెప్పాడని కథ చాలా అద్భుతంగా ఉందని స్వయంగా సూర్యే చెప్పేసరికి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సూర్య అండ్ లోకేష్ కనగరాజ్ లు ఇప్పుడు చేస్తున్న తమ తమ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాక వాళ్ళిద్దరి కాంబినషన్ లో రోలెక్స్ క్యారక్టర్ని ప్రధానంగా చేసుకొని మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ సూర్య తమ్ముడు కార్తీ నటించి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఖైదీ మూవీ కొనసాగింపు గానే విక్రమ్ మూవీ వచ్చిన విషయం విదితమే.