నేటి సమాజంలో చాలా మంది స్త్రీలు తమ భర్త చెడు అలవాట్లకు బానిసయ్యాడని ఫీలవుతుంటారు. భర్తను మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారు. దాంతోపాటు భర్త పరాయి స్త్రీలపై వ్యామోహం చెందుతున్నాడని బాధపడుతూ ఉంటారు. పరస్త్రీ వ్యామోహం విషయంలో చాలా మంది భార్యలు తీవ్రంగా మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో భర్త వ్యసనాలను దూరం చేసి భార్యకు అనుకూలంగా మారేలా చేసుకోవడం కోసం కొన్ని నివారణ మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు.
పరిహార శాస్త్రంలో చాలా వరకు ఈ అంశానికి సంబంధించి ఉపాయాలను పెద్దలు చెబుతున్నారు. ఇలాంటి పరిహారాలు పాటించడం వల్ల భర్త చెడు వ్యసనాలకు, దులవాట్ల నుంచి దూరం అవుతాడని చెబుతున్నారు. మీ భర్త జన్మ నక్షత్రం రోజున శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారికి తులసి దళాలతో అర్చన చేయించాలి. తులసి దళాలు కలిపిన తీర్థాన్ని మీ భర్తకు ఇవ్వాలి.
ఇలా చేయడం వల్ల లక్ష్మీనరసింహ స్వామి వారి అనుగ్రహం వల్ల మీ భర్తలో క్రమంగా మార్పు వస్తుందని చెబుతున్నారు. దాంతోపాటు ఇంట్లో ఆడవారు 40 రోజులపాటు ప్రత్యేకమైన దీపం వెలిగించాలని చెబుతున్నారు. పూజా మందిరంలో రోజూ దీపం వెలిగించే టప్పుడు విప్పనూనెతో దీపాన్ని వెలిగించాలని సూచిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత భర్త క్రమంగా వ్యసనాల నుంచి దూరం అవుతాడని చెబుతున్నారు.
మీ భర్తతో కలిసి వారానికోసారి దూడతో కలిసి ఉన్న ఆవు వద్దకు వెళ్లాలి. ఆవుకు, దూడకు కలిసి ఏదైనా ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భర్తకు పరస్త్రీ వ్యామోహం వదిలిపోతుందని చెబుతున్నారు. భర్తకు ఉన్న పరస్త్రీ వ్యామోహాన్ని తొలగించే శక్తి మెట్ల పూజకు ఉందని చెబుతున్నారు. కొండపై ఆలయానికి వెళ్తున్నప్పుడు మెట్ల పూజ చేసి దైవాన్ని దర్శించుకోవడం చేస్తే తగ్గిపోతుందని చెబుతున్నారు.