శృంగారం విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన ఒక గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో భార్యను చంపేశాడు భర్త. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
మద్యం ఒక మహమ్మారిలా తయారైంది. సరదాగా తాగే మందు కాస్తా వ్యసనంగా మారి చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. యువత కూడా దీని బారిన పడి భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు. మద్యం మత్తులో తాగుబోతులు చేసే కొన్ని పనులు ప్రాణాల మీదకు తీసుకొస్తున్నాయి. మద్యం తాగుతూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఘటనల గురించి కూడా వింటూనే ఉన్నాం. ఆల్కహాల్ సేవనం తర్వాత ఇంటికొచ్చి కుటుంబీకులతో గొడవ పడిన ఘటనల గురించి వార్తల్లో చూస్తునే ఉన్నాం. ఇలాంటి ఘటనల్లో కొన్నిసార్లు వ్యక్తిగత దాడుల వరకు వెళ్లాయి. అలాంటి ఒక ఘటనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో కట్టుకున్న భార్యను కడదేర్చాడో భర్త. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జాష్పుర్ జిల్లాలో జరిగింది. శృంగారం మీద భర్తతో జరిగిన వాగ్వాదం ఒక మహిళ ప్రాణాలు తీసింది. ఆల్కహాల్ తాగి ఇంటికి చేరుకున్న భర్త శంకర్ రామ్‌తో అతడి భార్య ఆశాబాయి సెక్స్ చేసేందుకు నిరాకరించింది. ఈ విషయంపై ఆలుమగల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆశాబాయి బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బావిలోకి దూకిన శంకర్ రామ్ ఆమెను కాపాడాడు. కానీ మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలై అది తీవ్రతరమైంది. దీంతో నిందితుడు భార్య మీద దాడి చేసి ఆమెను చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.