మీరు ఇంజనీరింగ్ చదివారా..? మీ చుదువుకు తగ్గ ఉద్యోగం కోసం వేచిచూస్తున్నారా..? అయితే ఈ సువర్ణావకాశం మీకోసం. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ .. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని మనవి.
భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 10 ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే సంబంధిత పనిలో ఏడాది పాటు అనుభవం కూడా తప్పనిసరి.
మొత్తం ఖాళీలు: 10 (ప్రాజెక్ట్ సూపర్‌వైజర్)
విభాగాలు: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్స్.
అర్హత: కనీసం 60% మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత. అలాగే సంబంధిత పనిలో కనీసం ఏడాది పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.03.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్ల వారిగా వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదట ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. అనంతరం నింపిన దరఖాస్తు ఫారంలను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది.
చిరునామా:
జీతభత్యాలు: నెలకు రూ.43, 550 చెల్లిస్తారు. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 10.04.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 29.04.2023.
ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 06.05.2023.