ఐపీఎల్ ఫైనల్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు.. ఓ మహిళా అభిమాని షాకిచ్చింది. డ్యూటీలో ఉన్న పోలీస్ పై దౌర్జన్యం చేయడంతో పక్కనున్నవాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఐపీఎల్-2023 ఫైనల్. చెన్నై-గుజరాత్ మధ్య మ్యాచ్. అన్నీ సరిగా జరుగుంటే ఈ పాటికే మ్యాచ్ పూర్తయిపోయి.. కప్ కొట్టింది ఎవరో తెలిసిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు. దానికి కారణం వర్షం. సడన్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ బ్రో(వర్షం).. కనీసం ఒక్క ఓవర్ అయినా పడనీయకుండా చేశాడు. దీంతో స్టేడియంకి ఎంతో ఆత్రుతగా వచ్చిన చాలామంది ఫ్యాన్స్ నిరాశగా వెనుదిరిగారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఫైనల్ చూడటానికి వచ్చిన ఓ మహిళా అభిమాని.. డ్యూటీలో ఉన్న పోలీస్ పై దౌర్జన్యం చేయడం మాత్రం అందరూ షాకయ్యేలా చేసింది. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొచ్చేస్తే.. అహ్మదాబాద్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ ఆదివారం జరగాల్సింది. కానీ ప్లాన్ ఫెయిలైంది. వర్షం సడన్ ఎంట్రీ ఇవ్వడంతో నిర్వహకులు ఏం చేయలేకపోయారు. ఈ ఐపీఎల్ సీజన్ చివరి సీజన్ చూద్దామని దేశం నలుమూలల నుంచి ఫ్యాన్స్.. మోదీ స్టేడియానికి వచ్చారు. కానీ వాళ్లకు నిరాశే ఎదురైంది. ఆగకుండా వర్షం కురవడంతో రిజర్వ్ డేకి మ్యాచ్ ని మార్చారు. అంటే సోమవారం ఇదే మైదానంలో మ్యాచ్ జరగనుంది. అందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది.
ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ మహిళా.. ఐపీఎల్ డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ పై దౌర్జన్యం చేసింది. చేయి కూడా చేసుకుంది. ఆ తర్వాత అతడిని కిందపడేసి మరీ కొట్టింది. అయినాసరే సదరు పోలీస్ ఏం అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా సదరు మహిళ.. మరోసారి కాలితో ఆయన్ని తన్నింది. పక్కనే కూర్చున్న ఆడియెన్స్.. అలా చూస్తూ ఉండిపోయారు తప్పితే ఆపే ప్రయత్నం అస్సలు చేయలేదు. అయితే ఈ గొడవకు ముందు-వెనక ఏం జరిగిందనేది ఎవరికీ తెలియట్లేదు. మరి అసలు ఈ గొడవకు కారణమేంటని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Kalesh B/w Police officer and an Woman in Narendra Modi stadium during #cskvsgt match:pic.twitter.com/xxT6anE1yR
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 28, 2023