సూర్య కుమార్ బ్యాటింగ్ కి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఫిదా అయిపోయాడు. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ ఒక్క షాట్ చూసి వేరే లెవల్ రియాక్షన్ ఇచ్చాడు.
సచిన్ టెండూల్కర్ పేరు చెప్పగానే అద్భుతమైన రికార్డులు, మైండ్ పోయే బ్యాటింగ్.. ఇలా చాలా గుర్తొస్తాయి. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి పదేళ్లవుతున్నా సరే స్టిల్ ఇప్పటికీ అతడిని అభిమానిస్తున్నారు. సందర్భంగా వచ్చిన ప్రతిసారీ మాస్టర్ బ్లాస్టర్ ని గుర్తుచేసుకుంటున్నారు. అలాంటి సచిన్ నుంచి అసలు ఫ్యాన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేయని రియాక్షన్ ఒకటి వచ్చింది. తాజాగా ముంబయి-గుజరాత్ సందర్భంగా సూర్య బ్యాటింగ్ చూస్తూ ఆ రియాక్షన్ ఇచ్చారు. సూర్య కొట్టిన ఆ ఒక్క షాట్ కి సచిన్ ఫిదా అయిపోయారు. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వస్తే.. ఐపీఎల్ మంచి ఊపు మీద సాగుతోంది. గుజరాత్ పై తాజా మ్యాచ్ లో గెలిచిన ముంబయి, ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ లో ముంబయి గెలవడానికి కారణం సూర్యకుమార్. ఎందుకంటే మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. మనోడు మాత్రం 49 బంతుల్లో 103 పరుగులు చేసి విజయానికి కారణమయ్యాడు. దీంతో ముంబయి 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులతో పాటు సచిన్ కూడా సూర్య బ్యాటింగ్ కి ఫిదా అయిపోయాడు. అవును మీరు విన్నది నిజమే.
ముంబయి బ్యాటింగ్. 18.1 ఓవర్ సందర్భంగా షమి బౌలింగ్ చేస్తున్నాడు. అప్పటికే 40 బంతుల్లో 73 రన్స్ తో ఉన్న సూర్య.. తన గేర్ మార్చి రెడీగా ఉన్నాడు. షమి వేసిన బంతిని చాలా నీట్ గా స్లైస్ చేశాడు. దీంతో అదికాస్త స్టాండ్స్ పడింది. సిక్స్ అయింది. అయితే ఈ షాట్ చూసి స్టేడియంలో ఉన్నవాళ్లకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక సచిన్ కూడా ఇలా కట్ చేశాడు! అనేలా చేతులతో చూపిస్తూ కనిపించారు. ఆ వీడియో, ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. సచిన్ నుంచి ఈ రియాక్షన్ అస్సలు ఊహించలేదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి సూర్య సిక్స్ కి సచిన్ రియాక్షన్ చూసిన తర్వాత మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.
One of the most incredible shots of the night by Suryakumar Yadav.pic.twitter.com/cqqdH6EMER
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2023