బాగా ఆడినా.. ఆడకున్నాకేకేఆర్ జట్టు గత కొంత కాలంగా విండీస్ స్టార్ ఆల్ రౌండర్ మీద పూర్తి నమ్మకముంచింది. ప్రస్తుత సీజన్లో ఫామ్ లేమితో విఫలమవుతున్నా తుది జట్టులో ఇంకా కొనసాగిస్తోంది. దీంతో కేకేఆర్ జట్టు యాజమాన్యం మీద రస్సెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రస్సెల్ కేకేఆర్ జట్టు తనకు జాతీయ జట్టుకన్నా ఎక్కువని చెప్పుకొచ్చాడు.
కేకేఆర్ కి విండీస్ స్టార్ ఆల్ రౌండర్ రస్సెల్ కి విడదీయరాని సంబంధం ఉంది. 2014 లో తొలిసారి ఈ జట్టులో ఈ జట్టులో చేరిన ఈ విధ్వంసకర ఆల్ రౌండర్ ఇప్పటివరకు కేకేఆర్ కి ఎన్నో సంచలన విజయాలనందించాడు. ఇక 2019 సీజన్లో అయితే రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ సీజన్లో 510 పరుగులతో పాటు 204 స్ట్రైక్ రేట్ ఉండడం గమనార్హం. అయితే బాగా ఆడినా… ఆడకున్నా కేకేఆర్ జట్టు ఈ అల్ రౌండర్ మీద పూర్తి నమ్మకముంచింది. ప్రస్తుత సీజన్లో ఫామ్ లేమితో విఫలమవుతున్నా తుది జట్టులో ఇంకా కొనసాగిస్తోంది. దీంతో కేకేఆర్ జట్టు యాజమాన్యం మీద రస్సెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రస్సెల్ కేకేఆర్ జట్టు తనకు జాతీయ జట్టుకన్నా ఎక్కువని చెప్పుకొచ్చాడు.
రస్సెల్ కెరీర్ గమనిస్తే విండీస్ జట్టులో కన్నా ఐపీఎల్ మ్యాచులే ఎక్కువగా ఆడినట్టు తెలుస్తుంది. ఒకానొక దశలో ఫామ్ లో ఉన్న ఈ స్టార్ అల్ రౌండర్ ని విండీస్ జట్టు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో విఫలమవుతున్నా కేకేఆర్ జట్టు రస్సెల్ ని కొనసాగిస్తోంది. ప్రస్తుత సీజన్లో వరుసగా విఫలమవుతూ వస్తున్న రస్సెల్ బెంగళూరు మ్యాచులో సత్తా చాటాడు. బ్యాటింగ్ లో 19 బంతుల్లో 3 సిక్సులు 2 ఫోర్లతో 34 పరుగులు, బౌలింగ్ లో ఒక వికెట్ తీసాడు. ఈ నేపథ్యంలో రస్సెల్ కేకేఆర్ జట్టుని పొగుడుతూనే విండీస్ క్రికెట్ బోర్డు మీద సంచలన వ్యాఖ్యలు చేసాడు.
రస్సెల్ మాట్లాడుతూ “కేకేఆర్ నా కలల్ని నిజం చేసింది. నా మోకాలికి గాయం అయితే వైద్యం అందేలా చేసింది. నిజం చెప్పాలంటే వేరే దేశం గాని, ఫ్రాంచైజీగాని నా మీద ఇంతలా ఇన్వెస్ట్ చేసి ఉండకపోవచ్చు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. 9 సంవత్సరాలుగా నా జర్నీ కేకేఆర్ తో కొనసాగుతుంది. వేరే ఏ ఫ్రాంచైజీ వైపు కూడా చూడలేదు. ప్రతి సంవత్సరం ఎంతో మంది క్రికెటర్లను కలుస్తున్నాను. కేకేఆర్ జట్టు నాకెప్పటికీ స్పెషల్” అని కేకేఆర్ మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు. మరి రస్సెల్ వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయి కామెంట్ల రూపంలో తెలపండి.