జరిగింది కోల్ కతా- రాజస్థాన్ మ్యాచ్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఓ విషయాన్ని గుర్తుచేసుకుంటూ తమ జట్టుని తిట్టుకుంటున్నారు!
కోల్ కతా vs రాజస్థాన్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. యశస్వి జైస్వాల్ సూపర్ బ్యాటింగ్ దెబ్బకు రాయల్స్ నీళ్లు తాగినంత ఈజీగా విజయం సాధించింది. ఏకంగా కోహ్లీనే రాజస్థాన్ బ్యాటర్ జైస్వాల్ ని మెచ్చుకున్నాడు. తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ కూడా పెట్టాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ మ్యాచ్ చూసిన బెంగళూరు జట్టు ఫ్యాన్స్ ఆర్సీబీని తెగ తిడుతున్నారు. దానికి ఓ కారణముంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరుగుతోంది?
అసలు విషయానికొస్తే.. తాజాగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 149/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. చెప్పాలంటే బౌల్ట్, చాహల్ తమ సీనియారిటీని చూపించారు. చాహల్ కేవలం 25 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయగా, బౌల్ట్ 15 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ని గెలిపించాడు. దీంతో రాజస్థాన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
అయితే ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన చాహల్.. ఐపీఎల్ లోనే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ బ్రావో రికార్డుని బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో చాహల్ బౌలింగ్ చూసిన నెటిజన్స్ చాలామంది.. అసలు ఆర్సీబీ ఇతడిని ఎందుకు వదులుకుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇది ఆర్సీబీ ఫ్యాన్స్ ని తెగ ఇరిటేట్ చేసింది. దీంతో తమ జట్టునే తిట్టుకుంటున్నారు. జట్టులో సిరాజ్ తప్పితే మరో బౌలర్ లేడు. అలాంటిది చాహల్ ఎందుకు వదిలేశార్రా అని విమర్శిస్తున్నారు. మరి ఆర్సీబీ చాహల్ ని వదులుకుని తప్పు చేసిందని మీకేమైనా అనిపించిందా? కింద కామెంట్ చేయండి.
Congratulations to you legend of IPL
चतुर चालाक चहल भाई ।#chahal #yuzi 🇮🇳🙏🙏🙏🙏😘😘😘❤️❤️❤️🌹🌹🌹💐💐💐🤗🫡🫡🫡🫡🫡👍 pic.twitter.com/eVpBq73qIm— rajat vaishnav (@Rj0007lover) May 7, 2023