చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకున్నాడంటే దానికి తిరుగుండదు. బ్యాటింగ్ ఆర్డర్ దగ్గర నుంచి ఫీల్డింగ్ సెట్ చేసేంత వరకు ధోని తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించబడింది. దీంతో ధోనిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు . అయితే చెన్నై సూపర్ కింగ్స్ లో ఒక బౌలర్ మాత్రం ధోని ఫీల్డింగ్ ని పూర్తిగా మార్చేస్తాడట.
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకున్నాడంటే దానికి తిరుగుండదు. బ్యాటింగ్ ఆర్డర్ దగ్గర నుంచి ఫీల్డింగ్ సెట్ చేసేంత వరకు ధోని తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించబడింది. అయితే ధోని ఫీల్డింగ్ బాగా సెట్ చేస్తాడని అందరికీ తెలుసు. సాధారణంగా ఫీల్డింగ్ సెట్ చేసేటప్పుడు… కెప్టెన్ బౌలర్ చెప్పిన మాటకు కూడా కాస్త రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ క్రమంలో ఫీల్డర్, కెప్టెన్ కలిసి ఫీల్డింగ్ లో మార్పులు చేస్తూ ఉంటారు. కానీ ధోని ఒక్కసారి ఫీల్డింగ్ సెట్ చేసాడంటే బౌలర్లు ఏ మాత్రం మాట్లాకుండా దానికి తగ్గట్లుగా బౌలింగ్ చేస్తారు. కానీ ఒక బౌలర్ ధోని చెప్పిన మాట అసలు వినేవాడు కాదంట. ఇంతకు ఎవరా బౌలర్ ?
ఒక మ్యాచులో దీపక్ చాహర్ ఫీల్డింగ్ మార్చాల్సిందిగా కోరితే ధోని బౌలర్ ని మార్చేస్తా అని చెప్పాడు. ఈ విషయం అప్పట్లో తెగ వైరల్ అయింది. దీపక్ చాహర్ పిల్లాడు. ధోనికి చాలా అంతర్జాతీయ అనుభవం ఉందని మహీకే అందరూ సపోర్ట్ చేశారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచుల్లో ధోనికి అపార అనుభవం ఉంది. దీంతో ధోనిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు . అయితే చెన్నై సూపర్ కింగ్స్ లో ఒక బౌలర్ మాత్రం ధోని ఫీల్డింగ్ ని పూర్తిగా మార్చేస్తాడట. అతనెవరో కాదు ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ డ్వెయిన్ బ్రావో.
ఐపీఎల్ లో మొదట ముంబై ఇండియన్స్ కి ఆడిన బ్రావో.. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి వచ్చేసాడు. ప్రస్తుతం చెన్నై జట్టుకి కోచ్ గా ఉన్నాడు. బ్రావో గురించి ధోని మాట్లాడుతూ..” ఐపీఎల్ లో బ్రావో నేను సెట్ చేసిన ఫీల్డింగ్ అంతా మార్చేస్తాడు. ఈ విషయంలో అతన్ని నేను ఏమి అనలేను. ఎందుకంటే బ్రావోకి నాకంటే ఎక్కువగా టీ 20 అనుభవం ఉంది. దీంతో అతను చెప్పినట్లుగానే ఫీల్డింగ్ సెట్ చేస్తాను”. అంటూ కామెంట్ చేసాడు. అయితే ఇప్పటివరకు ధోని ఎంత చెబితే అంతా అనుకునేవాళ్లకు తాజా వ్యాఖ్యలతో ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.