ధోని ఏది చేసిన అది కేవలం ఫ్యాన్స్ కే కాదు అందరికీ ప్రేత్యేకంగా కనిపిస్తుంది. గ్రౌండ్ లో ఊహకందని నిర్ణయాలు తీసుకునే ధోని మైదానం వెలుపల తన మంచి మనసుని చాటుకుంటాడు.తాజాగా ఆస్కార్ విన్నర్స్ కి గిఫ్టులు ఇస్తూ అందరినీ సర్ ప్రైజ్ చేసాడు.
ధోని.. ధోని.. ప్రస్తుతం ఈ పేరు ఎక్కడ చూసిన మార్మోగిపోతోంది. ధోని హవా కేవలం స్టేడియంలోని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తూ, ఎవరినో ఒకరిని కలుస్తూ తన ప్రేత్యేకతను చాటుకుంటాడు. గ్రౌండ్, డ్రెస్సింగ్ రూమ్, హోటల్స్ , ఇలా మిస్టర్ కూల్ ఎక్కడ ఉంటే కెమెరాలు అక్కడ వాలిపోతాయి. ప్రస్తుతం ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని భావిస్తున్న అభిమానులు మహేంద్రుడు ఎక్కడికి వెళ్తే అక్కడ సన్ది చేస్తూ కనిపిస్తున్నారు. ఇక నిన్న తమిళనాడు సీఎం కరుణానిధి స్టాలిన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్నీ కలిసి వార్తల్లో నిలిచినా ధోని.. తాజాగా ఆస్కార్ విన్నర్స్ కి గిఫ్టులు ఇస్తూ కనిపించాడు.
ధోని ఏది చేసిన అది కేవలం ఫ్యాన్స్ కే కాదు అందరికీ ప్రేత్యేకంగా కనిపిస్తుంది. గ్రౌండ్ లో ఊహకందని నిర్ణయాలు తీసుకునే ధోని మైదానం వెలుపల తన మంచి మనసుని చాటుకుంటాడు. ఈ క్రమంలో నిన్న కొంతమంది ఆస్కార్ విన్నర్స్ కి గిఫ్ట్ లు ఇస్తూ కనిపించాడు. ఇటీవల ఎలిఫాంట్ విస్పర్స్ సినిమాకి ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో బెల్లీ, బోమన్, కార్తీక్ గోనస్లవ్స్ లకు ధోని తన జెర్సీని వీరికి గిఫ్ట్ గా ఇచ్చి తన గొప్ప మనసు ఏంటో మరోసారి తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ధోనిని కలవాలని ఎంతోమంది ఆరాటపడుతుంటే.. ధోని మాత్రం వీరిని కలిసి ఇలా జెర్సీ ఇవ్వడం ప్రస్తుతం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ జట్టు తలపడనుంది. చెన్నై చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మొత్తానికి ఆస్కార్ విన్నర్లకి ధోని తన జెర్సీని గిఫ్ట్ గా ఇవ్వడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
MS Dhoni and CSK felicitated Bomman and Bellie.
A lovely gesture by CSK! pic.twitter.com/55SKMPjSWL
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2023