అందరిదీ ఓ బాధయితే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ది మరోబాధ. మ్యాచుల్లో గెలవడం, ఓడిపోవడం సంగతి అటుంచితే.. ఓ విషయంలో మాత్రం తెగ బాధపడుతున్నారు. అసలు తట్టుకోలేకపోతున్నారు.
ఐపీఎల్ సీజన్ మొదలైతే చాలు.. ఆర్సీబీ, చెన్నై, ముంబయి ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఈ జట్లకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఎవరికీ ఉండదు. బహుశా అది సాధ్యం కాకపోవచ్చు కూడా. అందుకే ఈసారి చాలా అంచనాలతో ఈ మూడు బరిలోకి దిగాయి. చెన్నై తప్పితే మిగతా రెండూ అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మిగతా వాళ్లకు ఏమోగానీ ఈసారి ఐపీఎల్.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి కాస్త స్పెషల్ అనే చెప్పాలి. మ్యాచుల్లో గెలుపోటములు సంగతి పక్కనబెడితే.. ఓ విషయం మాత్రం వాళ్లని తెగ బాధపెడుతోంది. ఇంతకీ ఏంటి సంగతి?
అసలు విషయానికొస్తే.. ఈసారి ఐపీఎల్, అహ్మదాబాద్ స్టేడియంలో చెన్నై-గుజరాత్ మ్యాచ్ తో మొదలైంది. సీఎస్కే ఇప్పటివరకు రెండు మ్యాచులు హోం గ్రౌండ్ లో, మిగతా ఆరు మ్యాచులు ప్రత్యర్థి జట్ల సొంత మైదానాల్లో ఆడింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే.. స్టేడియం ఏదైనా సరే చెన్నై మ్యాచు ఉందంటే.. మొత్తం పసుపు కలర్ లో ధోనీ స్లోగన్సే వినిపిస్తున్నాయి. ప్రతి దగ్గరా క్రికెట్ లవర్స్ ధోనీ కోసమే మ్యాచులు చూడటానికి వస్తున్నారు. కానీ ధోనీ మాత్రం బ్యాటింగ్ కి అస్సలు రావడం లేదు!
ప్రతి జట్టులో బ్యాటర్లు ఔట్ అయితే అందరూ కంగారు పడతారు. కానీ చెన్నై టీమ్ బ్యాటర్లు ఔట్ అయితే మాత్రం ఫ్యాన్స్ తెగ ఆనందపడతారు. ఎందుకంటే ధోనీ క్రీజులోకి వస్తాడని. తాజాగా రాజస్థాన్ తో మ్యాచులోనూ ధోనీ వస్తాడు, గెలిపిస్తాడని అనుకున్నారు. కానీ మహీ రాలేదు, మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు. ప్రతి మ్యాచ్ లోనూ దాదాపు ఇలానే జరుగుతుందని అనుకుంటున్నారు. ధోనీ కాస్త ముందొచ్చి సిక్సులు, ఫోర్లు కొట్టొచ్చుగా అని మాట్లాడుకుంటున్నారు. సరిగా చెప్పాలంటే చెన్నై మ్యాచ్, కప్ గెలిచినా ఫ్యాన్స్ పట్టించుకోరు. ధోనీ బ్యాటింగ్ కి దిగితే చాలని అంటున్నారు. మరి మీకు కూడా అలానే అనిపిస్తోందా? అయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
That is Thala KGF 👑🙇💛#Dhoni #MSDhoni𓃵 #CskVsKkr #KKRvCSK pic.twitter.com/hHh0oa94QM
— Addicted To Memes (@Addictedtomemez) April 23, 2023