డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఐపీఎల్ 2022 లోకి అడుగుపెట్టిన ‘చెన్నై సూపర్ కింగ్స్‘ ఆటేమో కానీ, ఆ జట్టు కెప్టెన్ ఎవరా? అన్నది మాత్రం జనాలకు అర్థమవ్వట్లేదు. టోర్నీ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని.. రవీంద్ర జడేజాకు ఆ బాధ్యతలు అప్పగించాడు. జడేజా కెప్టెన్సీ చేపట్టాక.. చెన్నై దిశ, దశ రెండు మారిపోయాయి. వరుస ఓటములు, ఆటలో రాణించకపోవడంతో ఒత్తిడికి గురైన జడేజా అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈసారి కెప్టెన్ ఎవరా? అంటే.. మళ్లీధోనీనే. తిరిగి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్సీ చేపట్టిన ధోనీ గతంలో కంటే.. కాస్త హడావుడిగా కన్పించాడు.
గ్రౌండ్ లో ఎప్పుడు కూల్ గా కనిపించే ధోనీ తన ప్రశాంతతను కోల్పోయాడు. మ్యాచ్ అఖరి ఓవర్‌లో ముఖేష్ చౌదరిపై ధోని కోపంతో ఊగిపోయాడు. అఖరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 37 పరుగులు కావల్సిన నేపథ్యంలో ధోని ముఖేష్ చేతికి బంతికి అందించాడు. ముఖేష్ వేసిన అఖరి ఓవర్ తొలి రెండు బంతులకు సిక్స్, ఫోర్ పూరన్ బాదాడు. ఈ క్రమంలో వెంటనే ధోని ఫీల్డ్‌లో మార్పులు చేశాడు. పూరన్‌కు ఆఫ్‌సైడ్‌లో ధోని ఫీల్డ్ సెట్ చేశాడు. అయితే ముఖేష్ ఫీల్డ్‌కు భిన్నంగా లెగ్ సైడ్ బంతిని వేశాడు. అయితే వెంటనే అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించాడు. దీంతో అసహానికి గురైన ధోని.. ధోనీ ముఖేష్ వైపు చూస్తూ.. ఆఫ్‌సైడ్‌లో అంతమంది ఫీల్డర్‌లను పెట్టాను. అయినా ఎందుకు లెగ్ సైడ్ వేస్తున్నావ్.. మైండ్ పెట్టి బౌలింగ్ చేయ్ అన్నట్లు సీరియస్‌గా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Dhoni 2.0 – Captain Cool🧊 to Captain Hot🔥! IPL 2022 (01.05.2022)
Click here to find out:https://t.co/PsOS53Uh6D#CSKvsSRH #IPL2022 #Match46 #chennaisuperkings #CSK #SRH
#MSDhoni #whistlePodu #Yellove #ravindrajadeja #Captain #yelloveagain #whistlepoduarmy #Cricket pic.twitter.com/chcgYImTun— Virtual Nanban (@VirtualNanban) May 1, 2022
ఇది కూడా చదవండి: MS Dhoni: కెప్టెన్‌గా జడేజా ఎందుకు విఫలం అయ్యాడో చెప్పిన ధోని
ఇక.. మ్యాచ్ అనంతరం ధోనీ బౌలర్లకు పలు సలహాలు ఇచ్చాడు. హైస్కోరింగ్ మ్యాచ్‌ల్లో ఒక ఓవర్ లో 3, 4 సిక్సర్లు వచ్చినా సరే.. మిగిలిన రెండు బంతులను డిఫెండ్ చేయగలగడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఎవరైనా టీ20క్రికెట్లో హిట్టింగ్ చేయాలనే చూస్తారు.. బౌండరీలు ఇచ్చినంత మాత్రాన.. బౌలింగ్ లయ దెబ్బతినకుండా బంతులు వేయాలని.. యంగ్ ప్లేయర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై సీఎస్కే13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Chennai Skipper MS Dhoni opens up about giving captaincy to Ravindra Jadeja earlier this season.
(📸 : BCCI)#Bethive #Cricket #IndianT20League2022 #Chennai #Hyderabad #MSDhoni #RuturajGaikwad #RavindraJadeja pic.twitter.com/bUddbmnjvj
— BetHive (@The_BetHive) May 2, 2022
The Sun revolves around him..🥰#WhistlePodu #CSK #Dhoni pic.twitter.com/URP8SDyu13
— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) May 2, 2022
The King is Back 😍💥#MSD #Dhoni #CSK #ChennaiSuperKings #IPL2022 pic.twitter.com/Mclvh7tAlr
— Behindwoods (@behindwoods) April 30, 2022