ఐపీఎల్ 202 సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ అధికారికంగా ముగిసింది. గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుందామనుకున్న ధోనీసేనకి ముంబై దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. గత మ్యాచ్‌లో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను తుడిచిపెట్టింది ముంబై ఇండియన్స్. లీగ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరుస ఓటములతో సతమవుతున్న ముంబై.. వెళ్తూ వెళ్తూ.. చెన్నైని తన వెంట పెట్టుకుపోయింది. అయితే ఈ మ్యాచులో అంపైర్ చేసిన పని అందరని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే.. ధోని భయపెట్టడం వల్లే అంపైర్ అలా చేశాడని టాక్ విపిస్తోంది.
ప్లేఆఫ్ రేసులో ఉంటాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలింది. అనంతరం 98 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 33 పరుగులకే ముంబై 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ టైంలో క్రీజులోకి వచ్చిన హృతిక్ షోకీన్.. సిమ్రాన్ జిత్ వేసిన 6 ఓవర్ మూడో బంతిని ఫ్లిక్ చేయబోయాడు. అది కాస్తా.. పాడ్స్ కు తగిలి ధోని చేతుల్లోకి వెళ్ళింది. వెంటనే ధోని అప్పీలు చేయగా.. అప్పటివరకు చడిచప్పుడూ చేయకుండా ఉన్న అంపైర్ ఒక్కసారి ధోనీ అప్పీలును చూసి కంగారుపడి.. ఆ ఔటే ఔటే అన్నట్లు ఔటిచ్చేశాడు. షోకీన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో నాటౌట్ అని తేలింది.
#CSKvsMI #IPL2022 pic.twitter.com/MLzPnMpibH
— Subuhi S (@sportsgeek090) May 12, 2022
ఇది కూడా చదవండి: MS Dhoni: ధోని చేసిన ఆ చిన్న తప్పిదమే CSK కొంపముంచిందా?
ఇప్పటికే ఈ సీజన్ లో అంపైర్లు నానా పెంట చేశారు. రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ లో చోటుచేసుకున్న నోబాల్ వివాదం ఎంత పెద్ద రచ్చయిందో తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు అంపైర్ నితిన్ మీనన్‌ను కన్పిస్తే కొట్టేస్తారేమో అనే రేంజులో ఆ వివాదం నడిసింది. ఆ తర్వాత కూడా వైడ్ బాల్స్ ను.. నాట్ వైడ్ అని, వైడ్ కానీ బాల్స్ ను.. క్లియర్ వైడ్ అంటూ మరికొందరు అంపైర్లు అటు బ్యాటర్లను, ఇటు బౌలర్లను కన్ఫ్యూజ్ చేశారు. దీంతో వైడ్ బాల్స్ కు కూడా రివ్యూ పెట్టండంటూ క్రికెట్ ప్రముఖులు సూచించేదాకా యవ్వారం వచ్చింది. ఇలా.. ఒకటి మరవకముందే మరొకటి జరుగుతుండండంతో.. అభిమానులు అంపైర్లపై గుర్రుగా ఉన్నారు. ఈ సీజన్ ను మాత్రం అంపైర్లు ఎక్కడికో తీసుకెళ్లారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. మరి ఈ సీజన్ లో అంపైర్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Umpires in ipl 2022 #IPL2022 #IPL
🥱 pic.twitter.com/sh2qBI8UEU— Santosh Raina 🇮🇳 (@Rainasmudge) May 13, 2022
Very very poor umpiring this season !!#RohitSharma #IPL2022 #Umpires pic.twitter.com/jTVVr5JsI7
— Rohit Sharma Fanclub India (@Imro_fanclub) May 9, 2022
That stare from #DavidWarner to one of most pathetic umpires (#NitinMenon) of #IPL2022
This year’s umpiring has been absolutely terrible. Must say that! @IPL pic.twitter.com/P0ORJEQJQo
— Bhartendu Sharma (@Bhar10duSharma) May 8, 2022