ఐపీఎల్ 2022లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తికావడంతో సీజన్ ముగింపునకు చేరుకుంటుంది. కొన్ని జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు ముందడుగు వేయగా, మరికొన్ని ప్లే ఆఫ్స్ చేరుకోవడానికి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ రెండో కోవకు చెందింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై ఈ సీజన్‌లో చాలా వెనకబడింది. ఒక్క ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందన్న తరుణంలో.. జడేజా నుంచి ధోనీ తిరిగి పగ్గాలు అందుకున్న ధోనీ.. విజయంతో జట్టును ప్లే ఆఫ్ రేసులో నిలబెట్టాడు. ‘తలా’ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడంతో ప్లే ఆఫ్స్ లెక్కలు మారతాయని అభిమానులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు తొమ్మిది మ్యాచులు ఆడిన చెన్నై 3 విజయాలు, 6 పరాజయాల(6 పాయింట్ల)తో 9వ స్థానంలో ఉంది. లీగ్ దశలో చెన్నై ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచులో ఓడితే.. టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందన్న తరుణంలో విజయాన్ని సాధించి తిరిగి ప్లే ఆప్స్ రేసులోకొచ్చింది. ఈ క్రమంలో సీఎస్కే గురుంచి ఆసక్తికర చర్చ నడుస్తోంది. కెప్టెన్ గా ధోనీకున్న మార్కుతో.. జట్టును ప్లే ఆప్స్ కు చేరుస్తాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. కెప్టెన్ గా ధోనికి తిరుగులేని రికార్డు ఉంది. అదే చెన్నైని మరోసారి గట్టెక్కిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చెన్నై..ప్లే ఆప్స్ కు చేరితే మాత్రం టైటిల్ తమదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
Thalaivan Irukkindraan! 🦁#SRHvCSK #WhistlePodu #Yellove 💛 pic.twitter.com/WKgFGm1OC1
— Chennai Super Kings (@ChennaiIPL) May 1, 2022
Blockbuster opening and a 🥳 Climax! What a close to Sunday! 😍#SRHvsCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Z1xrRAPaW8
— Chennai Super Kings (@ChennaiIPL) May 1, 2022
CSK తరువాత ఆడబోయే మ్యాచుల వివరాలు
మే 04న: రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు
మే 08న: ఢిల్లీ క్యాపిటల్స్
మే 12న: ముంబై ఇండియన్స్
మే 15న: గుజరాత్ టైటాన్స్
మే 20న: రాజస్థాన్ రాయల్స్
ఇది కూడా చదవండి: MS Dhoni: మైండ్ దొబ్బిందా? ఏం బౌలింగ్ వేస్తున్నావ్? బౌలర్ పై ధోని సీరియస్!
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు
సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు మే 22న ముగియనుండగా.. అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించనున్నాయి. ప్రస్తుతానికి, ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఆడిన 9 మ్యాచుల్లో 8 విజయాల(16 పాయింట్లు)తో అగ్రస్థానంలో ఉంది. ఇక గుజరాత్ తరహాలోనే అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన మరో కొత్త జట్టు లక్నో జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన లక్నో 7 విజయాలు, 3 పరాజయాలతో రెండో స్థానంలో ఉంది. ఏదో అద్భుతాలు జరిగి ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలైతే తప్ప ఈ సమీకరణలు మారకపోవచ్చు.
Gujarat Titans – No.1 in the points table ✅
Lucknow Super Giants – No.2 in the points table ✅New teams are dominating the IPL 2022 points table 🔥💥#GT #LSG #IPL2022 #DCvsLSG #Cricket #IPL2022 pic.twitter.com/3ltTBfeFh5
— Wisden India (@WisdenIndia) May 1, 2022
తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (9 మ్యాచుల్లో 6 విజయాలు, 3 పరాజయాలతో 12 పాయింట్లు), సన్‌రైజర్స్ (9 మ్యాచుల్లో 5 విజయాలు, 4 పరాజయాలతో 10 పాయింట్లు), ఆర్సీబీ (10 మ్యాచుల్లో 5 విజయాలు, 5 పరాజయాలతో 10 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (9 మ్యాచుల్లో 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు), పంజాబ్ (9 మ్యాచుల్లో 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు), కేకేఆర్ (9 మ్యాచుల్లో 3 విజయాలు, 6 పరాజయాలతో 6 పాయింట్లు), చెన్నై (9 మ్యాచుల్లో 3 విజయాలు, 6 పరాజయాలతో 6 పాయింట్లు), ముంబై (9 మ్యాచుల్లో ఓ విజయం, 8 పరాజయాలతో 2 పాయింట్లు) జట్లు వరుసగా ఉన్నాయి. మరి చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరుతుందా? లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Newbies continue to dominate the #IPL2022 points table. Which two sides will join them? pic.twitter.com/8Bi4mdIxoT
— 100MB (@100MasterBlastr) May 2, 2022
Perusa onnum illa ..
Csk qualify aaganum na
Top 3 teams should win all there matches (lsg,rr,gt )
Rcb , srh should only win 2 matches & dc , Punjab , kkr should only win 3 matches
We should win all are next matches#WhistlePodu #Yellove
— hide_it (@TrilokchandRR) May 2, 2022