కొంత మంది కూల్ డ్రింక్స్ ను నీళ్లు తాగినట్లు తాగుతుంటారు. మరికొందరైతే మంచినీళ్ల కంటే ఎక్కువగా కూల్ డ్రింక్సే తాగుతుంటారు. చల్లగా గొంతులోకి వెళ్తుంటే.. ఆ మజాయే వేరంటూ గుటకలేస్తారు. తాగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ తరువాత ఆరోగ్యానికి చేటు అనే సంగతి మీకు తెలుసా? మన పెద్దల కాలంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో మనిషి సగటు ఆయుష్షు రేటు సగానికి పడిపోయింది. మన పూర్వీకులు చక్కని ఆహారపు అలవాట్లతో వందేళ్ల వరకు జీవించేవారు. నేటి వారు అనేక ఆరోగ్య సమస్యలతో తక్కువ కాలమే జీవిస్తున్నారు. ఈ పాపంలో కూల్ డ్రింక్స్ కు కూడా వాటా ఉంది. ఇటీవల గట్ జర్నల్ లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం…. శీతల పానీయాలను ఎక్కువగా తాగేవారు త్వరగా అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారని తెలిసింది.
ఈ పరిశోధనలో కూల్‌డ్రింక్స్, ఇతర చక్కెర పానీయాలు ఎక్కువగా తీసుకున్న వారిలో పెద్దప్రేగు క్యాన్సర్ సమస్య ఉన్నట్లు కనుగొన్నారు. అదే సమయంలో ఒక రోజులో ఒకటి కంటే ఎక్కువ సార్లు కూల్ డ్రింక్స్ తాగే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే వారానికి ఒక సారి కూల్ డ్రింక్ తాగే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తేల్చారు. శీతల పానీయాలను తక్కువగా తీసుకుంటే పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం. ఈ పానీయాల తయారీలో కృత్రిమ చక్కెర, ప్రిజర్వేటివ్ లు మొదలైన వాటిని ఉపయోగిస్తారు. వీటి వినియోగంతో ఊబకాయం సమస్య పెరుగుతుంది. చిన్న వయస్సులోనే బీపీ, మధుమేహం, థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు చుట్టుముడతాయి. ఇది కాకుండా ఈ పానీయాలు కాలేయానికి కూడా హాని చేస్తాయి. కాలేయం దానిలో ఉన్న చక్కెరను జీర్ణం చేయడానికి చాలా కష్టపడాలి. దీని కారణంగా చాలా సార్లు కాలేయంలో వాపు ఉంటుంది. అందువల్ల పిల్లలతో సహా ఏ వయస్సు వారైనా కూల్ డ్రింక్స్ వినియోగానికి దూరంగా ఉంటే మంచిది. శీతల పానీయాలు తాగేందుకు బాగానే ఉంటుంది. కానీ, అది స్లోపాయిజన్ గా శరీరంలోకి చేరి మనిషిని చంపేస్తుంది. పరిశోధకుల సర్వేలో కూల్ డ్రింక్స్ తాగితే ఆయుష్సు తగ్గుతుంది వెల్లడైయింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.