సమాజంలో మహిళలు, యువతులపై దాడులు రోజు రోజకు మితిమీరుతున్నాయి. వారిపై శారీరక వేధింపులకు గురిచేయటం, కాదంటే హత్య చేయటం వంటి దారుణ ఘటనలు లెక్కలేనన్ని జరుగుతూ కలకలం రేపతున్నాయి. అయితే తాజాగా ఓ యువకుడు మాత్రం 60 యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేసి ఆపై హత్య చేసిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.స్థానికంగా ఈ ఘటన కలకలం రేగింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజస్థాన్ రాష్ట్రం హనుమాన్‌గఢ్‌లో ఉన్న పిలిబంగ ప్రాంతం. ఇదే పట్టానికి చెందిన 19 ఏండ్ల కుర్రాడు పక్కింట్లో ఉన్న 60 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆ మహిళ ప్రతిఘటించటంతో ఏకంగా ఆ యువకుడు ఆ వృద్ధురాలిని హత్యచేశాడు. ఇక అంతటితో ఆగాడా అంటే అదీ లేదు. చనిపోయింది అని కూడా వదలకుండా శవంపై పడి రాక్షసుడిలా అత్యాచారం చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మైనర్ బాలుడు చేసిన దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.